గత అధ్యక్షుడు ట్రంప్ హయాం నుండి అమెరికాలో వలస వాదులపై కఠినంగా వ్యవహరించడం చూస్తున్నాం. ఒక స్థాయిలో ప్రాంతీయం ప్రియం మిగిలిన వారు వెళ్లిపోవాల్సిందే అనే నినాదం వినిపించింది. అనధికారికంగా దేశంలో ప్రవేశించే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుందని దాని వలన స్థానికులకు అవకాశాలు లేకుండా పోతున్నాయని ట్రంప్ వాదించాడు. అప్పుడు దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది. భారతీయులు కూడా అనేక మంది అనధికారంగా అమెరికాలో ఉన్నట్టు తెలిసింది. వారిని కూడా తక్షణమే వెళ్లిపోవాల్సిందిగా ట్రంప్ ప్రభుత్వం ఆదేశించింది. ఇలా ఉన్నపళంగా వెళ్ళమంటే ఎలా అంటూ కొందరు పోరాటం చేశారు కూడా. అప్పుడే కొత్త వీసా నిబంధనలు తెచ్చాడు ట్రంప్. అయితే ఆ తరువాత జరిగిన అధ్యక్ష ఎన్నికలలో బైడెన్ గెలవడంతో పరిస్థితులు కాస్త మెరుగుపడ్డాయి.

కానీ తాజాగా హైతీ నుండి వలసవాదులు అమెరికాలో చొరబడటానికి ప్రయత్నించినప్పుడు అక్కడి దళాలు వారిని కొట్టి తరిమేయడానికి ప్రయత్నించాయి. ఇది ఇప్పుడు సామజిక మాధ్యమాలలో హల్ చల్ చేస్తుంది. దీనిపై ప్రస్తుత ప్రభుత్వం పై కూడా అనేక విమర్శలు వస్తున్నాయి. వలస వాదులను నిలువరించడానికి అమెరికా కూడా తీవ్రంగా కృషి చేస్తూనే ఉంది. కానీ ఎప్పటికప్పుడు చొరబాట్లు కూడా ఎక్కవుగానే జరుగుతున్నాయి. అసలే కరోనా విజృంభిస్తుంది. ఈ సమయంలో ఎవరినైనా దేశంలోకి స్వాగతిస్తే వారి వలన కరోనా ఇంకాస్త విజృంభిస్తే ఎలా అనేది బహుశా బైడెన్ ఆలోచన కావచ్చు.

ఎంత కరోనా భయం ఉన్నప్పటికీ  గడప దాకా వచ్చిన వారిని తిప్పి పంపడం ఏంటనేది కొన్ని వర్గాల ప్రశ్న. ఒకవేళ వారికి కరోనా ఉందేమో అనే సందేహం ఉంటె వారికి పరీక్షలు నిర్వహించి అందులో కరోనా నెగటివ్ వస్తేనే దేశంలోకి అనుమతించవచ్చు కదా అనేది వారి వాదన. అంతే కానీ, ఇష్టానికి దళాలను పెట్టి కొట్టించడం ఎంతవరకు సబబు అంటున్నారు. మరోపక్క తాలిబన్ గొడవ, ఎవరు ఎటు నుండి వచ్చి దాడులకు పాల్పడుతారో తెలియని స్థితి కూడా ఈ విధమైన ప్రవర్తనకు కారణంగా చెప్పవచ్చు. ఐఎస్ సహా పలు తీవ్రవాద సంస్థలు ఆఫ్ఘన్ ఆక్రమణ అనంతరం యాక్టీవ్ అయ్యాయని నిఘా వర్గాలు చెపుతూనే ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: