టీడీపీ పార్టీ నిజమైన అధినేత ఎన్టీఆర్. సొంత కష్టంతో పార్టీ పెట్టి ఆరు నెలలలో రాష్ట్రం అంతటా పర్యటించి విశ్రాంతి లేకుండా శ్రమించి పార్టీని నిలబెట్టాడు. సినిమా వాళ్ళు రాజకీయాలలోకి రావడం సహజమే అనుకున్న వాళ్ళు ఆయన కు ప్రజాక్షేత్రంలో లభిస్తున్న ఆదరణ చూసి బెల్లం చుట్టూ ఈగలు ముగినట్టు పార్టీలో కి వలసలు పెరిగాయి. ఇంకా పార్టీకి తిరుగులేదు అనేంతవరకు ఆయన కష్టపడుతూనే ఉన్నాడు. ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు వారి కోసం ఎన్నో పధకాలు ప్రవేశపెట్టి అందరి మనసులలో ప్రజానేతగా నిలిచిపోయాడు. మద్యపాన నిషేధం, రూపాయికే బియ్యం లాంటి అనేక పథకాలు ప్రజలకు అందించడంలో విజయవంతం అయ్యాడు. కొద్ది కాలంలో ప్రజాక్షేత్రంలో ఇంత విజయం సాధించిన నేతలు అది సినీ ప్రస్థానంతో వచ్చిన వారు చాలా తక్కువ.

ఇలాంటి నేత చుట్టూ రాక్షస మూకలు చేరడం మొదలు పెట్టాయి. అప్పటి నుండి ఆయన కు అండగా ఉన్నట్టు నటిస్తూ ఆయన హావభావాలు అలవాట్లు గమనిస్తూ వెన్నుపోటుకు సరైన సమయం చేసుకున్నాయి. సమయం వచ్చింది, ఒక ఆడదానిని రంగంలోకి దింపారు. ఆయన జీవిత చరిత్ర రాసేందుకు అని ఆయన కు దగ్గరగా ఆమెను చేర్చారు. అంత దగ్గరగా ఆయనను చూసే భాగ్యం కలిగిందని భావించిన ఆమె ఆయన మంచి మనసుకు లొంగిపోయింది. అంటే ఆయనకు అభిమాని అయ్యింది. ఇది రాక్షసులు గమనించి ఆమెకు ఆయనకు లేనిపోని సంబంధం అంటగట్టారు. వాళ్ళ ప్రణాళిక ప్రకారం పార్టీ లాగేసుకుంటే మళ్ళీ పార్టీ పెట్టి కొద్ది రోజులలో ప్రజాక్షేత్రంలో  పోటీకి సిద్ధం అవుతాడు అనే అనుమానంతో ఆయన శీలం పై మచ్చ తెస్తే ఆయనే గుండె పగిలి చస్తాడు, అడ్డు లేకుండా పోతాడు, అప్పుడు పార్టీ తమ చేతిలోకి వస్తుంది అనేది వ్యూహం.

అనుకున్నట్టే ఆ స్త్రీ కి ఆయనకు లేనిపోని సంబంధాన్ని అంటగట్టడంలో విజయం సాధించారు. దాని వలన ఒక మహిళ జీవితం నాశనం అవుతుందనే ఒక్క కారణం చేత ఆయన ఆమె ను వివాహం చేసుకోవాల్సి వచ్చింది(కానీ ఆ వయసులో ఆమెతో సంతోషంగా ఉండటానికి కాదు). దీనిని కుటుంబం అర్ధం చేసుకోలేకపోయినా అభిమానులు అర్ధం చేసుకుంటారు అని అనుకున్నాడు ఆయన. కానీ రెండు చోట్ల రాక్షసుల ప్రణాళికతో ఆయనకు చెప్పు దెబ్బలే మిగిలాయి. దీనిని భరించలేక నిజంగానే ఆయన గుండె పగిలింది, అంతటితో రాక్షసుల కల నెరవేరింది, పార్టీ పగ్గాలు దక్కేశాయి. కనీసం మహిళల కోసం ఆయన చేసిన అనేక పథకాలు కూడా గుర్తుచేసుకోకుండా అందరు ఆయనను మానసికంగా హింసించి చంపేశారు. పార్టీ అభిమానులు గా చెప్పుకుంటూ ఉన్న కుల ఛాందస వాదులు మాత్రమే ఇప్పుడు ఉన్నారు. ఆయన ఆత్మ ఇంకా ఘోషిస్తూనే ఉంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా పార్టీ పేరుతో ఆయన కు రాక్షసులు నివాళులు అర్పించడం, ఆయన పేరుతో పార్టీలో కార్యకర్తలు మెలగడం ఇందుకు కారణం. నిజంగా ఆయన  మీద అభిమానం ఉంటె ఆ పార్టీ వదిలేసి ఆయన కు అండగా ఉండాల్సింది. అలాగే ఆయన పార్టీని రాక్షసుల పాలు కాకుండా కాపాడుకోవాల్సింది. చిత్తూర్ లో తాజా వైసీపీ విజయం తో బహుశా ఆయన మనసు కాస్త శాంతించి ఉండవచ్చు అనేది ఆయన అభిమానుల అభిప్రాయం.

మరింత సమాచారం తెలుసుకోండి:

ntr