మా తూర్పు ప్రాంత క‌వుల‌ను, మా తూర్పు ప్రాంత బిడ్డ‌ల‌ను ఎంత‌గానో ప్రేమించిన గాన గంధ‌ర్వులు, ప‌ద్మ‌విభూష‌ణ్, డాక్ట‌ర్  శ్రీ పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం గారికి ప్ర‌థ‌మ వ‌ర్థంతి వేళ నివాళి అర్పిస్తున్నాను. సినీ సంగీత ప్ర‌పంచంలో యాభై ఏళ్లు అ లుపెరుగ‌క తెలుగుతో పాటు వివిధ భాష‌ల్లో పాట‌లు పాడి పండిత, పామ‌ర జ‌నాన్నీ అల‌రించిన బాలూ గారికి ఈ ప్రాంతంతో ఎంతో విడ దీయ‌రాని అనుబంధం ఉంది. ప్ర‌సిద్ధి పొందిన ఉత్తరాంధ్ర గేయ కవులు అయిన శ్రీ‌శ్రీనీ, సీతారామ శాస్త్రినీ ఎంత‌గానో అభిమాని స్తారు. ఇక్క‌డే విశాఖ న‌గ‌రంలో స్థిర‌ప‌డిన జాలాది గారిని అభిమానిస్తారు.


 ప్ర‌థ‌మ వ‌ర్థంతి వేళ బాలు గారిని స్మ‌రిస్తూ..

అదేవిధంగా మా శ్రీకాకుళం జిల్లాకు చెందిన నేప‌థ్య గాయ‌కులు అయిన గేదెల ఆనంద్ గారిని కూడా ఎంతో ప్రోత్స‌హించారు. ఈ సం ద‌ర్భంగా గాన గంధర్వుని స్మృతికి నా నివాళి. ఇవాళ ఆ మ‌హ‌నీయులు మ‌న మ‌ధ్య లేక‌పోయినా త‌ర త‌రాల హృద‌యాల్లో నిరం త‌రం నిలిచిపోతారు. ప్రాతః స్మ‌ర‌ణీయు లు అయిన బాలూ గారికి నేను న‌మ‌స్సులు చెల్లిస్తున్నాను. అక్ష‌రాంజ‌లి ఘ‌టిస్తు న్నాను. ఆయ‌న న‌టించ‌గా..మా ప్రాంతం నిర్మాత మొయిద ఆనంద‌రావు నిర్మించిన మిథునం సినిమాను  రేగిడి మండ‌లం, వావివ‌ల‌సలో చిత్రీక‌రించ‌డం, త‌రువాత ఈ ప్రాంత స‌హ‌జ సిద్ధ అందాల‌కు ఆయ‌న పుల‌కించి, ఇక్క‌డి వారితో ఆయ‌న ముచ్చ‌టిం చ‌డం అన్న‌ది ఇవాళ ప్ర‌స్తావించ‌ద‌గ్గ విష‌యం. అదేవిధంగా వ‌ర్థ‌మాన గాయ‌కులు చేప ట్టిన బాలు స్వ‌ర‌నీరాజ‌నం అనే కార్య‌క్ర‌మా న్ని జిల్లా కేంద్రంలో ఉన్న బాపూజీ క‌ళామందిరంలో నిర్వ‌హిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా నిర్వాహ‌కులు మిత్రా ఫౌండేష‌న్ కు , సిక్కోలు ఫ్యూచ‌ర్ సింగ‌ర్స్ కు నా త‌ర‌ఫున అభినంద‌న‌లు. మ‌రొక్క మారు ప్ర‌థ‌మ వ‌ర్థంతి వేళ బాలు గారిని స్మ‌రిస్తూ..

- కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు, ఎంపీ, శ్రీ‌కాకుళం


మరింత సమాచారం తెలుసుకోండి: