టీడీపీ చరిత్ర నాలుగు దశాబ్దాలు. ఎన్టీయార్ ఈ పార్టీని పెట్టారు. ఆయన ఉమ్మడి ఏపీని ఎనిమిదేళ్ళ పాటు పాలించారు. ఎన్టీయార్ 1983లో ముఖ్యమంత్రి అయ్యాక అక్కడితో ఆగలేదు. ఆ తరువాత ఆయన పొలిటికల్ రూట్ మార్చేశారు.

ఆయన 1984లో జాతీయ రాజకీయల వైపు దృష్టి సారించారు. ఆయన జాతీయ నాయకులను తెచ్చి మరీ విజయవాడ. హైదరాబాద్ లో మీటింగులు పెట్టారు. మొత్తానికి ఎన్టీయార్ భారతదేశం పార్టీని పట్టి తనదీ జాతీయ పార్టీ అని చెప్పుకోవాలని చూశారు. కానీ కుదరలేదు. ఇక చంద్రబాబు తీసుకుంటే ఆయన కూడా యునైటెడ్ ఫ్రంట్ అంటూ చక్రం తిప్పారు కానీ జాతీయ పార్టీ నేత కాలేకపోయారు.

అయితే ఉమ్మడి ఏపీ విభజన తరువాత మాత్రం ఆయన తన పార్టీని జాతీయ పార్టీగా ప్రకటించారు. ఒక రాష్ట్రం రెండు ముక్కలు అయింది. దాంతో అక్కడా ఇక్కడా టీడీపీ ఉండాలనుకుని బాబు జాతీయ పార్టీ అన్నారు. కానీ తెలంగాణాలో ఆ పార్టీకి అస్థిత్వం పెద్దగా లేదు. ఏపీ మీదనే మొత్తం ఫోకస్ ఉంది. ఇక అప్పట్లో అంటే 2014లో ఏపీలో అధికారంలోకి వచ్చిన కొత్తలో టీడీపీ తమ్ముళ్ళు ఒక మాట అనేవారు. తమది జాతీయ పార్టీ అని చెప్పుకునేవారు. కర్నాటక, తమిళనాడులలో కూడా పోటీ చేస్తామని చెప్పేవారు. కానీ అది అసలు కుదరలేదు.

మొత్తానికి ఏపీ తెలంగాణాలలో ఉన్న టీడీపీని పట్టుకుని జాతీయ పార్టీ అని చంద్రబాబు చెప్పుకుంటున్నారు. తాను జాతీయ పార్టీని ప్రెసిడెంట్ ని అని కూడా చెప్పుకుంటున్నారు. నారా లోకేష్ జాతీయ ప్రధాన కార్యదర్శి గా ఉన్నారు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం ఈ హోదా చెల్లదని కచ్చితంగా చెప్పేస్తోంది. జాతీయ పార్టీల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అందులో టీడీపీ లేదు. పైగా తెలుగు రాష్ట్రాలలో టీడీపీ వైసీపీ, టీయారెస్ పక్కా ప్రాంతీయ పార్టీలే అని కూడా పేర్కొంది. మరి చంద్రబాబు జాతీయ అధ్యస్ఖుడు ఎలా అవుతారు అన్న సెటైర్లు అయితే అపుడే పడిపోతున్నాయి. బాబు రెండు రాష్ట్రాలలో టీడీపీని పెట్టుని జాతీయ నేత ఎలా అవుతారు అని కూడ అంటున్నారు. పైగా తెలంగాణాలో పార్టీ ఉనికే లేదని మరి బాబు కూడా ప్రాంతీయ నేత మాత్రమే అని ప్రత్యర్ధులు అంటున్నారు. మొత్తానికి ఎన్నికల సంఘం ప్రకటన కాదు కానీ బాబు హోదాకు ముప్పు తెచ్చి పెట్టింది అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

tdp