రాజకీయాలలో సంపాదన అంటే వంశవృక్షం మొత్తం బ్రతికేంత పోగుచేసుకోవడం అని ఒక చిత్రంలో డైలాగు ఉంది. ఎప్పుడో పాత చిత్రమే. కానీ రాజకీయాలను ఆకళింపు చేసుకొని ఆ చిత్రం తీసినట్టుగా ఉంది, అందుకే అంత స్పష్టంగా చెప్పారు. నిజంగా రాజకీయాలు అంటే సంపాదించడానికి సులభ మార్గం. ఇక్కడ విజయం సాధించడం తేలిక కాకపోవచ్చు, ఒక్కసారి అధికారం వస్తే వంశానికంతా ఆ ఒక్కసారే సంపాదించుకోవచ్చు. అధికారం, ఎనలేని సంపద ఇంకేం కావాలి. ఎవరినైనా శాసించవచ్చు, ఏది కావాలన్నా కాళ్లదగ్గరకు రప్పించుకోవచ్చు. ఇంత రిచ్ గా బ్రతకడం అంటే ఎవరు మాత్రం కాదనుకుంటారు. అందుకే సంపాదించడం అనే ఆలోచన వస్తే మొదటి మార్గం ఇదే. కుదరకపోతే అప్పుడు రెండో మార్గం గురించి ఆలోచించాలి.

రాజకీయ నేతలు అంటే ప్రతియేటా వాళ్ళ ఆస్తుల వివరాలు తెలియజేస్తూ ఉండాలి. ఎంత వారైనా తమతమ ఆస్తుల వివరాలు వెల్లడించాల్సిందే. అప్పుడే చూడాలి ఒక్కో నేత గొప్పతనం. అన్ని ఆస్తులు బినామీ పేరుమీద పెట్టేసి, తమ ఖాతాలో పేదరాజు మాదిరి కాస్త నగదు మాత్రం చూపిస్తారు. అయినా ఆస్తులు వెల్లడించమనడం మాత్రమే వారి అధికారం, వాళ్ళ పేరుమీద ఉన్నవే వెల్లడించడం వీళ్ళ హక్కు. అంటే చట్టంలో ఉన్న లూప్ హోల్స్ చక్కగా వినియోగించుకొని తమ ఖాతాలో ఎంత ఉంటె ప్రమాదం రాదో అంతే ఉంచి అదే చూపిస్తారు ఆయా అధికారులకు.  అందుకే చట్టాలు పెద్దలకు చుట్టాలు అనేది. పేరుకు ప్రజాస్వామ్యం కానీ ప్రజలు పేదరాజులే.

తాజాగా భారత ప్రధాని మోడీ తన ఆస్తులను వెల్లడించారు. ఆయన ఆస్తివిలువ గత ఏడాదితో పోలిస్తే కాస్త పెరిగింది. పీఎం వెబ్ సైట్ లో పొందుపరిచిన వివరాల ప్రకారం ఆయన ఆస్తులు 30768885 రూ. గతేడాది ఈ విలువ 2.85కోట్లుగా ఉంది. అంటే 22 లక్షలు పెరిగిందన్నమాట. మర్చి 31నాటికి ఆయన బ్యాంకు ఖాతాలో లక్షన్నర నగదు; చేతిలో 36వేల నగదు ఉన్నాయి. ఎస్బిఐ ఖాతాలో 1.6కోట్ల డిఫాజిట్స్ ఉన్నాయి, అవి ఈ ఏడాది 1.86 కోట్లకు పెరిగింది. ఇక వాహనం అసలుకే లేదు. రుణాలు కూడా లేవు. స్టాక్ మార్కెట్ లో కూడా పెట్టుబడులు ఏమి లేవు.  నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ లో 8.9 లక్షలు; లైఫ్ ఇన్సూరెన్సు లో లక్షన్నర; 2002 లో కొన్న ఎల్ అండ్ టి బాండ్స్ 20వేలు పెట్టుబడులుగా ఉన్నాయి. అలాగే ఆయనకు 1.48 లక్షల విలువైన నాలుగు ఉంగరాలు ఉన్నాయి. 1.10కోట్ల భూమి ఒకటి ఉంది. 2014లో ప్రధాని అయ్యాక ఎటువంటి భూపెట్టుబడులు పెట్టలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: