ఇటీవల వెలువడిన ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికల్లో పూర్తిగా వైసీపీ ఆధిక్యం కొనసాగిన విషయం తెలిసిందే. అయితే ఇంతటి వైసీపీ హవాలో కూడా జనసేన కొంతమేర సత్తా చాటడం ఆశ్చర్యం కలిగించే అంశం..ఆ పార్టీ 1200 ఎం‌పి‌టిసి స్థానాల్లో పోటీ చేసి 177 వరకు ఎం‌పి‌టి‌సిలని గెలుచుకుంది. అలాగే 2 జెడ్‌పి‌టి‌సిలని కూడా గెలుచుకుంది. అయితే ఈ స్థాయిలో జనసేన గెలవడం కాస్త పవన్ కల్యాణ్‌కు ఊరటనిచ్చిన అంశం.

కాకపోతే కొన్నిచోట్ల జనసేన ఒంటరిగా గెలవలేదు. టి‌డి‌పితో పొత్తు పెట్టుకుని గెలిచింది. అలాగే ఎం‌పి‌పి స్థానాలని కూడా టి‌డి‌పితో కలిసే కైవసం చేసుకుంది. కొన్ని మండలాల్లో టి‌డి‌పి-జనసేనలు టై అప్ అయ్యి వైసీపీకి చెక్ పెట్టాయి. అంటే పవన్ కల్యాణ్‌కు వన్ మ్యాన్ షో చేసే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ విజయాలని చూసి జనసేన ఒంటరిగా సత్తా చాటేస్తుందని భావించడం కూడా సరికాదనే చెప్పొచ్చు.

అయినా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టి‌డి‌పికే వైసీపీకి చెక్ పెట్టడం సాధ్యం కావడం లేదు. ఆ పార్టీ ఎక్కడకక్కడ జగన్ దెబ్బకు కుదేలైపోతుంది. కానీ జనసేనతో పొత్తు పెట్టుకున్న చోట మాత్రం వైసీపీకి చెక్ పెట్టగలిగారు. అంటే ఇటు టి‌డి‌పి గానీ, అటు జనసేన గానీ ఒంటరిగా వైసీపీకి చెక్ పెట్టడం సాధ్యం కాదనే చెప్పొచ్చు. కానీ రెండు పార్టీలు కలిస్తే మాత్రం వైసీపీకి చెక్ పడిపోయే అవకాశం ఉందని అర్ధమవుతుంది.

అంటే పవన్ కల్యాణ్...సింగిల్‌గా రాజకీయాలు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదనే చెప్పొచ్చు. ముఖ్యంగా బి‌జే‌పితో కలిసి ముందుకెళ్లడం వల్ల జనసేనకు పెద్ద నష్టమే జరుగుతుందని తెలుస్తోంది. ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల జనసేన ఇప్పటికే చాలా నష్టపోయింది. ఇక భవిష్యత్‌లో ఆ పార్టీతో కలిసి ముందుకెళితే జనసేనకు ఇంకా నష్టం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలా అని సింగిల్‌గా పవన్ నెట్టుకు రావడం కష్టం. ఏదేమైనా టి‌డి‌పితో పోత్తే జనసేనకు ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: