రాష్ట్రంలో ఆ ప్రాంతం, ఈ ప్రాంతం అనే తేడా లేకుండా అన్నీ వర్గాల ప్రజలు వైసీపీకి మద్ధతు తెలిపిన విషయం తెలిసిందే. పంచాయితీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్, ఎం‌పి‌టి‌సి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికలనే తేడా లేకుండా వైసీపీకి భారీ మెజారిటీలు కట్టబెట్టారు. అసలు ప్రతి జిల్లాలోనూ వైసీపీ ఆధిక్యం కొనసాగింది. అంటే జగన్ పాలనపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారని ప్రతిపక్షాలు చేసే విమర్శలు అబద్ధమని తేలింది.

అంటే జగన్ పాలనకు ప్రజలు పూర్తిగా సంతృప్తిగా ఉన్నారని ఈ తీర్పులు చెబుతున్నాయి. అంటే జగన్ తీసుకునే ప్రతి నిర్ణయానికి ప్రజల ఆమోదం ఉందని అర్ధమవుతుంది. దీని బట్టి చూసుకుంటే జగన్..ఎలాంటి ఇబ్బంది లేకుండా మూడు రాజధానులు అమలు చేసేయోచ్చని తెలుస్తోంది. జగన్ అధికారంలోకి రాగానే మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అమరావతిని శాసన రాజధానిగా ఉంచేసి, కర్నూలుని న్యాయ రాజధానిగా, విశాఖపట్నంని పరిపాలన రాజధానిగా చేయాలని ఫిక్స్ అయ్యారు.


కానీ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్ష టి‌డి‌పి వ్యతిరేకించింది. అలాగే అమరావతి ప్రాంత ప్రజలు, రైతులు 600 రోజుల పై నుంచి దీక్షలు చేస్తూనే వస్తున్నారు. పైగా ఈ మూడు రాజధానుల అంశంపై కోర్టులో కూడా కొన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే ప్రజా తీర్పు పూర్తిగా వైసీపీకే అనుకూలంగా ఉన్నప్పుడు జగన్ తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి ప్రజల నుంచి పూర్తి అంగీకారం వచ్చిందనే చెప్పొచ్చు.

ఇక జగన్ వెనక్కి తిరిగి చూసుకోకుండా తక్షణమే మూడు రాజధానులు ఏర్పాటు చేసుకోవచ్చు. కోర్టు పరిధి దాటకుండా పాలన వైజాగ్ నుంచి మొదలుపెట్టవచ్చు. ఇప్పటికే మూడు రాజధానులు వచ్చేస్తాయని అధికార పార్టీ నేతలు హడావిడి ప్రకటనలు చేస్తున్నారు తప్ప, ఆ ప్రక్రియ మాత్రం పూర్తి కావడం లేదు. అయితే ఎం‌టి‌సిసి, జెడ్‌పి‌టి‌సి ఎన్నికలు కూడా పూర్తిగా వైసీపీకే అనుకూలంగా వచ్చిన నేపథ్యంలో జగన్...మూడు రాజధానుల ముచ్చట తీరే అవకాశం వచ్చిందనే చెప్పొచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి: