ఆస్తులు ఎన్ని ఉన్నా మనకోసం అంటూ ఎవరూ లేకపోతే ఆ జీవితంలో ఏదో లోటుగానే ఉంటుంది. అదే ప్రేమించే ఒక్క వ్యక్తి ఉన్నా ఆస్తులు లేకపోయినా మనశ్శాంతి తో జీవించవచ్చు. ప్రస్తుత పరిస్థితులు దీనికి బిన్నంగా ఉన్నాయి. మనసు కంటే ఆస్తులకే విలువ పెరిగిపోతుంది. కనీసం వస్తువులకు ఉన్న ప్రాధాన్యత మనసుకు ఉండటం లేదు. ప్రేమ ఉండాలి అంటే ఒకటి అవసరం అయినా ఉండాలి లేదా ఆస్తి అయినా ఉండాలి. ఇది ఇప్పటి ప్రేమ. కానీ కొన్ని చోట్ల ఇంకా ప్రేమ బ్రతికే ఉందనేది ఆయా సందర్భాలు నిరూపిస్తూనే ఉన్నాయి. సాధారణంగా ప్రకృతి సిద్ధంగా ఉండే స్థితి ఇప్పుడు లేదు, ఒకవేళ అది ఎక్కడైనా కనిపిస్తే అది వింతగా గొప్పగా కనిపిస్తుంది. ప్రస్తుత ప్రపంచంలో నిజమైన ప్రేమ పరిస్థితి కూడా అంతే.

ఇప్పటి లోకంలో కూడా ప్రతి చోట ప్రేమ పేరుతో జంటలు ఇళ్లు వదిలి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అయితే అవేవి ఎక్కువ రోజులు కొనసాగటం లేదు. కారణం వాళ్ళు ప్రేమ పేరుతో ఒక్కటయ్యారు తప్ప నిజంగా అదేమిలేదు. అదే ఉంటె ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కలిసే జీవిస్తారు తప్ప చిన్న చిన్న కారణాలు చెప్పి విడాకుల వరకు వెళ్ళరు. ఇది చెప్తే ముందు వాళ్ళు అర్ధం చేసుకోరు, విడిపోయాక చెప్పడానికి ఏమీ మిగలదు. కొందరు పిల్లలు కలిగాక కూడా ఇలాంటి పొరపాటు చేస్తూనే ఉన్నారు.

ఎన్ని జరుగుతున్నప్పటికీ అప్పుడప్పుడు నిజమైన ప్రేమలు కూడా అక్కడక్కడా కనిపిస్తున్నాయి. తాజాగా జపాన్ రాజ కుటుంబానికి చెందిన మాకో తాను ప్రేమించిన సామాన్యుడి కోసం రాచరికాన్ని వదిలేసుకోవడం జరిగింది. చిన్ననాటి నుండి మాకో అతడితో కలిసి చదువుకుంది. కొంతకాలానికి ఆ స్నేహం ప్రేమగా మారింది. కుటుంబం ఒప్పుకుంది, కానీ వారి వివాహం అనంతరం రాచరికం వదిలేయాలనేది వాళ్లకు ఆచారంగా వస్తుంది. సామాన్యులను వివాహం చేసుకున్న రాచారికులకు ఈ నిబంధన వర్తిస్తుంది. మాకో రాచరికం కంటే ప్రేమ గొప్పదని నిరూపించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: