భారతప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. ఈ భేటీలో ఆయన అమెరికా అధ్యక్షుడు బైడెన్ సహా కమలా హారిస్ తదితర నేతలతో పలు జాతీయ అంతర్జాతీయ అంశాలపై చర్చించారు. ముఖ్యంగా ఉగ్రవాదాన్ని పెరగకుండా చూడడంపై ఆయా దేశాలను కూడగడుతున్నారు మోడీ. ఈ పర్యటనలో భాగంగానే మోడీ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ లో ప్రసంగించారు. ప్రారంభం లోనే భారతదేశ చాయ్ వాలా ఐక్యరాజ్య సమితి లో నాలుగో సారి ప్రసంగించడం ప్రజాస్వామ్యం యొక్క బలాన్ని తెలియజేస్తుందని ఆయన అన్నారు. దేశంలో వేల దశాబ్దాలుగా ప్రజాస్వామ్య పరంపర కొనసాగుతుందని ఆయన తెలిపారు.

దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత పరిణామాలు ప్రజాస్వామ్యానికి బలాన్ని చేకూర్చాయని మోడీ అన్నారు. ప్రపంచంలో ప్రజాస్వామ్యం వికాసం పొందుతుందనే దానికి భారత్ అతిపెద్ద ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. అటువంటి దేశంలో టి అమ్మిన వ్యక్తి నేడు ఐక్యరాజ్య సమితిలో ప్రధాని హోదాలో ప్రసంగిస్తున్నారని, ప్రజాస్వామ్యంలో ఏదైనా సాధ్యమేనని ఆయన అన్నారు. అటువంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రతినిధిగా ఇక్కడ ఉన్నానని మోడీ అన్నారు. భారత్ ముఖ్య లక్ష్యం ప్రపంచంలో అందరు సంతోషంగా ఉండాలనే అని ఆయన తెలిపారు.  

ప్రపంచం ఎన్నడూ చూడని సంక్షోభం కరోనా వలన వచ్చిందని, ఆ పరిస్థితులలో కూడా భారత్ 3కోట్ల ఇళ్లను కట్టించిందని వెల్లడించారు. కరోనా సమయంలో ఎన్నో దేశాలకు భారత్ లో తయారైన వాక్సిన్ ను అందించామని ఆయన తెలిపారు. త్వరలో ముక్కు ద్వారా వేసే వాక్సిన్ కూడా సిద్ధం కానుందని ఆయన చెప్పారు. ఈ సంక్షోభంలో తాము తెచ్చిన కోవిడ్ యాప్ ఎంతో ఉపకరించింది అని మోడీ అన్నారు. భారత్ లో డిజిటల్ సంస్కరణలు కూడా వేగంగా విస్తరిస్తున్నామని, వాటి ఫలితాలు ప్రపంచ గతిని మార్చుతాయన్న నమ్మకం తమకు ఉందని మోడీ తెలిపారు. భారత అభివృద్ధి ప్రపంచానికి కొత్త ఊతం ఇస్తుందని మోడీ వెల్లడించారు. గ్రామాలలో డ్రోన్ మాపింగ్ లాంటి సాంకేతికత వాడుతున్నామని తెలిపారు మోడీ.

మరింత సమాచారం తెలుసుకోండి: