బాలీవుడ్ స్టార్ హీరోలు వెబ్‌ సీరీస్ లు చేస్తున్నారంటే అంతా ఆశ్చర్యపోయారు. స్టార్ హీరోలు వెబ్‌ సీరీసులు చేయడమేంటని పలు రకాలుగా మాట్లాడుకుంటున్నారు. అయితే బాలీవుడ్ లోనే కాదు.. టాలీవుడ్ లోనూ స్టార్ హీరోలు వెబ్‌ సీరీస్ ల బాట పడుతున్నారు. ఊహించని పాత్రలతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నారు.

స్మార్ట్ యుగం స్టార్ట్ అయ్యాక.. ఓటీటీ మార్కెట్‌ కు క్రేజ్ వచ్చింది. దీంతో పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు కూడా సొంత వేదికను తయారు చేసుకుంటున్నాయి. వరల్డ్‌ క్లాస్ కంటెంట్‌ని ఫాలో అవుతోన్న ఆడియన్స్‌ని మెప్పించేందుకు వెబ్‌ సీరీసులు తీస్తున్నాయి. స్టార్ హీరోలు సైతం ఈ కొత్త వెర్షన్ పై మోజు పెంచుకుంటున్నారు.  
 
రానా.. వైవిధ్యమైన పాత్రలకు ప్రాధాన్యత ఇస్తున్నాడు. బాహుబలి'లో విలన్‌గా నటించి నేషనల్‌ వైడ్‌గా పాపులారిటీ సంపాదించుకున్నాడు. తెలుగు, తమిళ్, హిందీ అనే తేడా లేకుండా అన్ని భాషల సినిమాలు చేస్తోన్న రానా ఇప్పుడు వెబ్‌ సీరీస్‌కి సైన్ చేశాడు. వెంకటేశ్‌తో కలిసి 'రానా నాయుడు' అనే సీరిస్‌కి ఒప్పందం కుదుర్చుకున్నాడు. అబ్బాయి, బాబాయ్ కలిసి నటిస్తుండటంతో ఈ వెబ్ సిరీస్ ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

నాగచైతన్య లవ్‌స్టోరీస్‌తో సూపర్ హిట్స్‌ కొడుతున్నాడు. విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో ఈ అక్కినేని వారసుడు.. ఒక హారర్‌ సీరీస్‌ చేయబోతున్నాడు. ఈ సీరీస్‌లో చైతన్య నెగటివ్‌ రోల్‌లో కనిపించబోతున్నాడు. ఇక నాగార్జున అయితే  ఓటీటీలోనూ అడుగుపెడుతున్నాడు. వెబ్‌ సీరీస్‌ కోసం చర్చలు జరిగే అవకాశముందంటున్నాడు నాగ్.  

అక్కినేని ఫ్యామిలీ నుంచి వెబ్‌ సీరీస్‌ల వైపు వెళ్లిన ఫస్ట్ స్టార్ సమంత. 'ఫ్యామిలీమెన్2' సీరీస్‌లో తమిళఈలం కమాండర్‌ రాజీ పాత్రతో నేషనల్‌ వైడ్‌గా గుర్తింపు తెచ్చుకుంది. నెగటివ్‌ రోల్‌తో తెలుగు ప్రేక్షకులని సర్‌ప్రైజ్ చేసింది. ఇప్పుడు అదే బాటలో మామయ్య.. హస్బెండ్ వెళుతున్నారు. చూద్దాం.. టాలీవుడ్ హీరోలు వెబ్ సిరీస్ లతో ఎలాంటి మాయ చేస్తారో.

 



మరింత సమాచారం తెలుసుకోండి: