తాలిబన్ లు మారాం అని చెప్పుకుంటూ ప్రపంచ దేశాల నుండి గుర్తింపు కోరుకుంటున్నాయి. కానీ తాజాగా వాళ్ళు ఒక కిడ్నప్ లు చేసే నేరస్తులకు విధించిన శిక్షలు చూస్తే అందరికి వారి తీరు ఏమిటో ఇట్టే అర్ధం అవుతుంది. తాలిబన్ లు కిడ్నపర్లను కాల్చి చంపి వారి శవాలను క్రేన్ లకు కట్టి జనావాసాలలో ఉంచారు. తాము శిక్షలు ఆడ, మగ, పిల్లలు అనే మీమాంశ చూపబోమని స్పష్టం చేశారు. తాజాగా ముల్లా ఒకపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో పాత తాలిబన్ రాజ్యంలో ఏయే శిక్షలు అమలు చేయబడ్డాయో అవే ఇప్పుడు అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఇది జరిగిన కొద్ది గంటలలో తాలిబన్ లు ఈ హత్యలకు పూనుకున్నారు.

వాళ్ళు నేరస్తులు కాబట్టి హింసించి చంపేశారు అనుకుందాం.. మరి ఆఫ్ఘన్ ను అక్రమంగా సొంతం చేసుకున్న వాళ్ళు మాత్రం నేరస్తులు కాదా..! ఈ చిన్న విషయం వాళ్ళ మతంలో చెప్పలేదా..! నిజానికి కొందరు మతం పేరు చెప్పుకుంటూ హింస చేస్తూ వారికి మానసిక దౌర్బల్యం ఉన్నట్టు చెప్పకనే చెబుతుంటారు. అదే తాలిబన్ ల అసలు మానసిక స్థితి. మతం పేరుతో అరాచకాలు చేయమని వాళ్ళ పవిత్ర గ్రంధాలలో ఉన్నదా.. అలా ఉంటె మిగిలిన అదే మతస్తులు ఎందుకు వీళ్ళను అనుసరించట్లేదు..! ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలు. కేవలం మతఛాందస వాదం తప్ప మరేమీ కాని మానసిక రోగులు మాత్రమే ఈ తాలిబన్ లు.

వాళ్ళు చేస్తే దైవికం, మిగిలిన వారు చేస్తే పాపం అన్నట్టు తాలిబన్ ల వ్యవహారం ఉంది. ఇన్నాళ్లు తీవ్రవాదులు పోషిస్తే బ్రతికారు మరి అలాంటి ఆహారం తీసుకోవడం కంటే ఉపవాసం ఉండి చావడం మేలని పవిత్ర గ్రంధాలలో ఉన్నది, దానికేం చెపుతారు ఈ తాలిబన్ లు. విల్లు కేవలం మానసిక రోగులు మాత్రమే, అదే తరహాలో వాళ్ళను గుర్తించాలి తప్ప, వాళ్లకు ఒక దేశం అనే గుర్తింపు ఇస్తే అది ప్రపంచం చేసే మరో తప్పటడుగు గా మిగిలిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: