నగరంలో మురుగునీటి శుద్ధిపై గత ప్రభుత్వాలకు ఇంత చిత్తశుద్ధి లేదంటూ మంత్రి త‌ల‌సాని మండిప‌డ్డారు. కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండటం నగర ప్రజల అదృష్టమ‌ని త‌ల‌సాని వ్యాఖ్యానించారు. సివరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్లు, తాగునీటి కోసం 5 వేల కోట్లను కేటాయించారని త‌ల‌సాని గుర్తుచేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధి కూడా పెరుగుతోందని త‌ల‌సాని వెల్ల‌డించారు. వచ్చే 25 ఏళ్లకు ప్రణాళికలు ఉండాలని షా కన్సల్టెన్సీ తో సర్వేలు చేయించిన‌ట్టు తెలిపారు. కేసీఆర్ కు నగర ప్రజలు, ప్రజాప్రతినిధుల తరపున కృతజ్ఞతలని త‌ల‌సాని అన్నారు. రెండేళ్లలో 31 సివరేజ్  ప్లాట్లు పూర్తయితే దేశంలో మనమే నెంబర్ 1 గా ఉంటామ‌ని త‌ల‌సాని వ్యాఖ్యానించారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని గ్రామాలకు తాగునీటి కోసం మొత్తం 1200 కోట్లు ఇచ్చారని త‌ల‌సాని గుర్తు చేశారు. 

సుంకిశీల ప్రాజెక్టు కూడా ఇవ్వడంతో నీటి సమస్య మరింత తీరనుందంటూ త‌ల‌సాని వ్యాఖ్యానించారు. వాటర్ బోర్డు చాలా బాగా పని చేస్తోందని త‌ల‌సాని చెప్పారు. ఏడేళ్లలో మంచినీటి కోసం ధర్నా చేసే పరిస్థితి ఎక్కడా లేదని త‌ల‌సాని వెల్ల‌డించారు. ఎయిర్ టెక్ మెషిన్ రెండు నియోజకవర్గాలకు ఒకటే ఉండేదని... కానీ సాంకేతికతను ఎక్కువగా వినియోగించి నియోజకవర్గానికి 4, 5 ఎయిర్ టెక్ మిషిన్లు ఉన్నాయని చెప్పారు. వాటర్ బోర్డు ఎండీ దాన కిషోర్ కు త‌ల‌సాని అభినందనలు తెలిపారు. హెచ్ఎండీఏ పరిధి కూడా పెరిగే అవకాశం ఉందని త‌ల‌సాని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా నగరం విస్తరణ జరుగుతోందని...నగరవాసులకు ప్రభుత్వ చర్యలు మేజర్ రీలిఫ్ కాబోతున్నాయంటూ త‌ల‌సాని వ్యాఖ్యానించారు.

అనంత‌రం హోం మంత్రి మ‌హ‌మూద్ అలీ మాట్లాడుతూ....సిటీ ఫ్యూచర్ ఆలోచించి ఒకేసారి సీఎం కేసీఆర్, కేటీఆర్  5 వేల కోట్లు ఇచ్చారని చెప్పుకొచ్చారు. రాష్ట్రమంతా మిషన్ భగీరథతో తాగునీరు ఇస్తున్నారని...నగరవాసుల తరపున సీఎం కేసీఆర్ గారికి ధన్యవాదాలు అదే విధంగా మంత్రి కేటీఆర్ గారికి అభినందనలు అంటూ మ‌హ‌మూద్ అలీ పొగ‌డ్త‌లు కురిపించారు. స్వాతంత్య్రం వచ్చిన త‌ర‌వాత‌ ఇంత మొత్తంలో ఒక సిటీకి నిధులు ఇవ్వడం ఇదే మొద‌టి సారని చెప్పారు. హైదరాబాద్ జలమండలి ఎండీ దాన కిషోర్ మాట్లాడుతూ.. రెండేళ్ల క్రితం మంత్రి కేటీఆర్ సివరేజ్ మాస్టర్ ప్లాన్ రెడీ చేయమన్నారని చెప్పారు. రెండేళ్లు సర్వే చేసి మాస్టర్ ప్లాన్ రెడీ చేసామ‌ని దాన కిషోర్ వెల్ల‌డించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: