2022 లో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ ఎన్నిక‌లు కాంగ్రెస్ మ‌నుగ‌డ‌ను తేల్చ‌నున్నాయి. ఉత్త‌ర ప్ర‌దేశ్‌, పంజాబ్‌, మ‌ణిపూర్‌, గోవా, ఉత్త‌రాఖాండ్ రాష్ట్రాల్లో రాబోయే ఏడాదిలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ముఖ్యంగా ఉత్త‌ర ప్ర‌దేశ్‌, పంజాబ్ కీల‌క రాష్ట్రాలుగా ఉన్నాయి. ఈ ఎన్నిక‌లు 2024 పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌కు సెమిస్ లాగా ప‌నిచేయ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ ప్ర‌భావం చూప‌క పోతే 2024 ఎన్నిక‌ల్లో పార్టీ ప‌ట్ల ప్ర‌జ‌ల్లో విశ్వాసం ఉండ‌దు.


  ఇత‌ర ప్రాంతీయ పార్టీలు కూడా ఇప్పటికే కాంగ్రెస్‌తో క‌ల‌వ‌డానికి సిద్దంగా లేదు. ఒక వేళ 2022 ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ప్ర‌భావం చూప‌క‌పోతే అన్ని ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌ను లైట్ తీసుకుంటాయి. అయితే, కాంగ్రెస్ మిత్ర ప‌క్షాల్లో విశ్వాసం క‌ల‌గ‌డానికి, నాయ‌కత్వం విష‌యంలో ప్ర‌భావం చూపాలంటే ఈ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ త‌ప్ప‌నిస‌రిగా గెలావాల్సి ఉంటుందని రాజ‌కీయ విశ్లేష‌కుల భావిస్తున్నారు. పంజాబ్‌లో రాజ‌కీయ మార్పులు చేయ‌డంతో ఆ ప్ర‌భావం రాబోయే ఎన్నిక‌ల్లో ఏ మేర‌కు ప్ర‌భావం ప‌డుతుందో చూడాలి.


   ఈ ఐదు రాష్ట్రాల్లో ఉత్త‌ర ప్ర‌దేశ్ కీల‌క‌మైంది. ఎందుకంటే ఢిల్లీకి వెళ్ల‌డానికి ఈ రాష్ట్రం ముఖ్య‌మైంది. అలాగే సీట్ల ప‌రంగా దేశంలోనే ఎక్కువ‌గా ఉన్న రాష్ట్రం యూపీ. కానీ, పోయిన ఎన్నిక‌ల్లో 403 సీట్ల‌లో కేవ‌లం 2 సీట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. దీంతో ఇప్పుడు స‌మాజ్ వాద్ పార్టీ గానీ బీఎస్ సీ గానీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోవ‌డానికి సిద్దంగా లేవ‌నే చెప్పాలి. ఇలాంటి ప‌రిస్థితిలో కాంగ్రెస్ ఏ విధంగా త‌న ప్ర‌భావాన్ని పెంచుకుంటుంద‌నేది చూడాలి. రాహుల్ గాంధీ కూడా అక్కడ ఓడి పోయాడు.


  అలాగే కాంగ్రెస్ పార్టీ కి ఉన్న ఓటు బ్యాంకు మొత్తం చెల్లాచెదురు అయిపోయింది. బ్రాహ్మ‌ణుల ఓట్లు బీజేపీకీ వెళ్లింది.  అలాగే ఆ పార్టీలోని కొంద‌రు సీనియ‌ర్ నాయ‌కులు బ‌య‌ట‌కు వెళ్లిపోయారు. అ లాగే కాంగ్రెస్ పార్టీకి స‌రైన నాయ‌కుడు కూడా లేడు. ఇలాంటి సంద‌ర్భంలో కాంగ్రెస్ ఏ మేర ప్ర‌భావం చూపుతుందో  వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: