ప్రస్తుతం రాజకీయాలు హాట్  హాట్ గా మారాయి. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అయితే... ప్రతి రోజు అప్ డేట్ లతో రాజకీయాలను ఆసక్తికరంగా మారుస్తున్నాయి. ప్రస్తుతం జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేసిన హాట్ కామెంట్స్... పొలిటికల్ సర్కిల్‌లో కాక రేపుతున్నాయి. ఇప్పటి వరకు సినిమాల గురించి, రాజకీయాల గురించి వేరు వేరుగా మాట్లాడిన పవన్ స్టార్... ఇప్పుడు ఓ సినిమా ఫంక్షన్‌లో రాజకీయాల గురించి ప్రస్తావించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మీడియాలో వస్తున్న కథనాలను ప్రస్తావిస్తూనే... రాజకీయాలపై, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార పార్టీపై తనదైన శైలిలో ఘాటు వ్యాఖ్యలు చేశారు పవన్. అసలు మీడియా ఏం చెప్పాలనుకుంటుందంటూ మొదలుపెట్టిన జనసేనాని... సెలబ్రెటీల ఇంటి విషయాలపై కథనాలు ఆపాలంటూ హితవు పలికారు. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు దారి తీసిన కారణాలను ప్రస్తావించారు.

మీకు దమ్ముందా అని మీడియాకు సవాల్ విసిరిన జనసేనాని... మూడేళ్ల కింద విశాఖ అంతర్జాతీయ ఎయిర్ పోర్టులో నాటి ప్రతిపక్ష నేత, నేటి ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని ప్రస్తావించారు. కోడి కత్తి దాడి కేసు ఏమైందని ప్రశ్నించారు పవన్. దీనిపై నాటి గవర్నర్ నరసింహన్ కూడా సీరియస్ అయిన విషయాన్ని గుర్తు చేసిన పవన్... ఈ కేసు ఇప్పుడు ఏమైందన్నారు. అసలు ఈ దాడి వెనుక ఉన్న కుట్ర కోణం వెలికి తీసే దమ్ముందా అని మీడియాను ప్రశ్నించారు. కోడి కత్తితో దాడి చేసిన వ్యక్తి ఏమయ్యాడు... ఆ కేసు దర్యాప్తు ఏ స్థాయిలో ప్రజలకు తెలియచేయాల్సిన అవసరం మీడియపైనే ఉందన్నాడు పవన్ కల్యాణ్. అలాగే సరిగ్గా ఎన్నికలకు ముందు వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు,  మాజీ మంత్రి, వైఎస్ జగన్ బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అసలు నిందితులు ఎవరూ అనే విషయాన్ని ప్రజలకు తెలియజేసేందుకు మీడియా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. అసలు హంతకులు ఎవరో అందరికీ తెలుసన్న పవన్... ఈ విషయంలో మీడియా లోతైన దర్యాపు చేసి... అసలు హంతకులను బయట పెట్టాలన్నారు. ఇడుపులపాయ ఫామ్ హౌస్‌లో అండర్ గ్రౌండ్‌లో డబ్బులు కట్టలు కట్టలుగా మూలుగుతుంటాయని అందరూ అంటున్నారు... వాటి విషయాలపై మీడియా వాస్తవాలు ఎందుకు వెల్లడించడం లేదన్నారు. ఓ సినిమా యాక్టర్ బైక్ ప్రమాదంపై మూడు రోజుల పాటు కథనాలు ప్రసారం చేసిన మీడియా... ఇలా ప్రజలకు పనికొచ్చే విషయాలను ఎందుకు పట్టించుకోవడం లేదని సూటిగా ప్రశ్నించారు పవన్ కల్యాణ్.


మరింత సమాచారం తెలుసుకోండి: