2014లో బీజేపీ- ప‌వ‌న్ క‌ళ్యాణ్ పొత్తు పెట్టుకుంటే ఇప్ప‌టికీ ఆ ప్ర‌భావం కూడా ఉండేది. కానీ, జ‌న‌సేన అందుకు సుముఖత వ్య‌క్తం చేయ‌లేదు. ఆ త‌రువాత బీజేపీకి జ‌న‌సేనా అప్పుడ‌ప్పుడు స‌పోర్ట్ ఇస్తూ వ‌చ్చింది. అలాగే అప్పుడు బీజేపీ, టీడీపీ పొత్తు పెట్టుకోవ‌డం వ‌ల్ల జ‌న‌సేనాని టీడీపీకి మ‌ద్ధ‌తు ఇచ్చారు. ఆ సంద‌ర్భంలో జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సామాజిక తెలంగాణ‌కు మ‌ద్ధ‌తు ఇస్తున్న‌ట్టు తెలిపాడు. కానీ, ఆ త‌రువాత యూట‌ర్న్ తీసుకుని మాట మార్చారు. అలాగే, చంద్ర‌బాబు రెండు క‌ళ్ల సిద్ధాంతో ఉన్నాడు. అలాగే, రాష్ట్రాన్ని విభ‌జించ‌డం స‌రేగానీ విభ‌జించిన తీరు బాగా లేదు అని ఆనాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌శ్నించిన తీరు అప్పుడు ఆస‌క్తిగా ఉండేది.

 
     కానీ, బీజేపీతో తెలుగు దేశం పొత్తు పెట్టుకోవ‌డం ద్వారా తెలుగు దేశానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌పోర్ట్ గా ప్ర‌చారం చేశారు. అప్పుడే రాజ‌కీయాల్లో బ‌లంగా దూసుకెళ్ధామ‌నుకున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు అది అంత‌గా వ‌ర్కవుట్ కాలేదు. జ‌న‌సేన పార్టీ పెట్టిన పెద్ద‌గా రాజ‌కీయాల్లో త‌న ప్ర‌భావం చూప లేక‌పోయాడు. అడ‌ప‌ద‌డ‌ప రాజ‌కీయాల్లోకి వ‌చ్చి త‌న ఉనికిని చాటుకునే ప్ర‌య‌త్నం చేశాడు. అధికార ప‌క్షం పై రాజ‌కీయ విమ‌ర్శ‌లు చేయ‌డం వెళ్లిపోవ‌డం.. మ‌ళ్లీ కొన్ని సంద‌ర్భాల‌లో రావ‌డం విమ‌ర్శ‌లు, ప్ర‌తివిమ‌ర్శ‌లు, ప్ర‌శ్నించ‌డం లాంటివి చేయ‌డం మ‌ళ్లీ తిరిగి వెళ్లిపోవ‌డమే త‌ప్ప గ్రౌండ్ లో ఉండి పెద్ద‌గా ఎఫ‌ర్ట్ పెట్ట‌లేద‌నే చెప్పాలి.


   పార్టీని పెట్టిన అనంత‌రం పార్టీని సంస్థాగ‌త నిర్మాణం కోసం జ‌న‌సేనాని ఇప్ప‌టి వ‌ర‌కూ కూడా చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డం గ‌మ‌నార్హం. అయితే, టీడీపీ కోస‌మే ఇదంతా చేస్తుంద‌ని అనుకుంటున్నారు. దీనికి సాక్ష్యం కూడా తూర్పులో ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల్లో క‌లిసి పోటీ చేయ‌డ‌మే. కానీ, కొన్ని చోట్ల జ‌న‌సేన‌కు ఎక్కువ‌గా ఎంపీటీసీ కి వ‌చ్చినా చైర్మెన్ల‌ను టీడీపీ తీసుకుంది. దీంతో కేవ‌లం ఓట్ల కోసం, సీట్ల కోసం జ‌న‌సేన ఇమేజ్‌ను వాడుకుంటుంద‌ని, ఇచ్చి పుచ్చుకునే దోర‌ణి ఉంటే ఇలా ఎందుకు చేస్తార‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: