ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు.... అన్ని రాష్ట్రాల కంటే చాలా విభిన్నంగా ఉంటాయి.  2019 అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ మెజారిటీతో వైసీపీ అధికారంలోకి వచ్చింది.  ఏకంగా 150 కి పైగా సీట్లు సంపాదించి వైసిపి పార్టీ... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. రికార్డు ప్రతిపక్షాలు అయినా తెలుగుదేశం పార్టీ మరియు  జనసేన పార్టీ లు ఘోర పరాభవాన్ని చవిచూశాయి. ఇక అధికారం చేపట్టిన అనంతరం... వైసిపి సర్కార్ సంక్షేమ పథకాలను చాలా సమర్థవంతంగా అమలు చేస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను... ఒక్కొక్కటిగా అమలు చేస్తూ పోతుంది. ఎక్కడ తగ్గకుండా... ప్రజల సేవే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. దీంతో 2019 ఎన్నికల అనంతరం జరిగిన ప్రతి ఎలక్షన్లలో... అధికార వైసిపి పార్టీ... విజయ కేతనం ఎగుర వేస్తుంది. అలాగే వైసిపి వైఫల్యాలు కూడా చాలా ఉన్నాయి. 

రాజధాని మార్పు, లోటు బడ్జెట్, విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు ఇలా ఎన్నో సమస్యలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వేధిస్తున్నాయి. సంక్షేమ పథకాల నేపథ్యంలో.. వైసిపి పార్టీని ప్రతిపక్షమైన టీడీపీ మరియు జనసేన పార్టీ లు సమర్థవంతంగా ఎదుర్కోవడంలో లేదు. దీంతో ప్రతి ఎన్నికల్లోనూ వైసిపి అఖండ విజయాలను సాధిస్తోంది. ఇది ఇలా ఉండగా...  తెలంగాణ తరహాలోనే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని సీఎం జగన్ యోచిస్తున్నట్లు గత వారం రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం మరియు జనసేన పార్టీ లు అప్రమత్తమయ్యాయి. ముందస్తు ఎన్నికల పై దృష్టి సారించాయి రెండు పార్టీలు. వైసిపి పార్టీని... సింగిల్ గా ఢీకొట్టే లేమని భావించిన ఈ రెండు పార్టీలు... పొత్తుకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం అందుతోంది. గత ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేయగా... ఘోర పరాభవాన్ని చవిచూశాయి.

ఇక ఈ సారి ఎలాగైనా వైసీపీ ప్రభుత్వాన్ని పడగొట్టాలని యోచనతో... పొత్తుకు సిద్ధమయ్యాయి. అంతేకాదు ఇప్పటికే సీట్ల పంపకం కూడా జరిగినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికలలో 25 ఎమ్మెల్యే సీట్లు మరియు ఐదు ఎంపీ సీట్లల్లో జనసేన పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా.. అంగీకారం తెలిపినట్లు సమాచారం. జనసేన పోటీ చేసే ఈ సీట్లు మినహా మిగతా అన్ని చోట్ల టిడిపి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి.  ఈ పొత్తుపై త్వరలోనే అధికారికంగా ప్రకటించే యోచనలో రెండు పార్టీలు ఉన్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికలలో... ఎలాగైనా వైసిపి పార్టీని పడగొట్టాలని ఆలోచనతో ముందుకు సాగుతున్నాయి జనసేన మరియు టిడిపి పార్టీలు. అయితే ఈ రెండు పార్టీల పొత్తు ఏమేరకు సక్సెస్ అవుతాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: