నిన్న‌టి వేళ ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయ దుమారం రేపినా, కొన్ని మాట‌లు ఆలోచింప‌జేశాయి. తిట్ల సంగ‌తి అటుంచింతే ఏపీ స‌ర్కారును ఇటీవ‌ల ఈ స్థాయిలో తిట్టిన వారే లేరు అని తేలిపోయింది. సంబంధిత ప‌రిణాలు ఎలా ఉన్నా కూడాప‌వ‌న్ ఎదుర్కోగ‌ల‌డా అన్న‌ది పెద్ద డౌట్. ఎందుకంటే జ‌గ‌న్ ఢీ కొనే ఫైటింగ్ స్పిరిట్ ప‌వ‌న్ కొన‌సాగిస్తేనే ఫ‌లితాలు బాగా ఉంటాయి.దీనిపై ప‌వ‌న్ వ‌ర్గాలు మ‌రో సారి ఆలోచించేందుకు స‌మ‌యం తీసుకుంటారా లేదా వెనువెంట‌నే త‌మ కార్యాచ‌ర‌ణ అమ‌లు చేస్తారా అన్న‌ది కీల‌కం.


ఏపీ మంత్రుల‌కూ, ప‌వ‌న్ కూ మ‌ధ్య ఎప్ప‌టి నుంచో ఉన్న త‌గాదాలు అన్నీ ఒక్క‌సారి గా భ‌గ్గుమ‌న్నాయి. ఇలా చెప్ప‌డం క‌న్నా ఆయ‌న‌కు ఎవ‌రిపై కోపం ఉందో అన్న‌ది తేలిపోయింది. చిరంజీవిని ఉద్దేశించి కూడా కొన్ని మాట‌లు చెప్పి, మ‌నం ప్రాథేయ ప‌డ‌నవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టంగా చెప్పాడు ప‌వ‌న్. సోద‌ర భావ‌న ఉంద‌న్న ఏపీ మంత్రులు.. సోదిలో సోద‌ర భావ‌న ఎందుకు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు మేలు చేయ‌ని సోద‌ర భావ‌న కార‌ణంగా ప్ర‌యోజ‌నం ఏంటి అని, అలాంటి సోద‌ర భావ‌న దిబ్బ‌ల్లో కొట్టుకోవ‌డానికి త‌ప్ప ఎందుకూ ప‌నికిరాద‌ని మండిప‌డ్డారు.

జ‌నసేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చాలా రోజుల‌కు జ‌గన్ పై తీవ్ర స్థాయిలో మండి ప‌డ్డారు. ఆయ‌న ఎన్న‌డూ లేని విధంగా జ‌గ‌న్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా దుమారం రేపుతున్నాయి. ముఖ్యంగా చిత్ర ప‌రిశ్ర‌మ‌ను ఉద్దేశించి ఆయ‌న చెప్పిన మాట‌లు ఇటు ప‌రిశ్ర‌మ వ‌ర్గాల‌కు ఊర‌టనిచ్చినా, భ‌విష్య‌త్ ప‌రిణామాల‌పై ఆందోళ‌న‌లు రేగుతున్నాయి. ఏపీలో థియేట‌ర్ల‌పై పాక్షికంగానో, పూర్తిగానో వైసీపీ పెద్ద‌ల హ‌క్కు పొందేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాల‌పై ప‌వ‌న్ విరుచుకుప‌డ్డారు. టిక్కెట్ల అమ్మ‌కం నిర్ణ‌యంపై చాలా కోపం అయ్యాయి. రిపబ్లిక్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకు ఇందుకు వేదికయింది. గంటకు పైగా ప‌వ‌న్ స్పీచ్ అభిమానుల‌ను ఉర్రూతలూగించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap