రిపబ్లిక్ సినిమా ప‌వ‌న్ లో గొప్ప స్ఫూర్తిని నింపింది. ఆయ‌న మాట్లాడిన ప్ర‌తిమాట రిప‌బ్లిక్ అనే వ‌ర్డ్ చుట్టూనే తిరిగింది. ఎన్న‌డూ లేనిది, ఆయ‌న ఆవేశంతో చెప్పిన మాట‌లు  రేపు ప్ర‌కంప‌న‌ల‌కు కార‌ణం కానున్నాయి. ఆయ‌న ఆవేశంలో చెప్పిన మాట‌లు కొన్ని వ‌ర్గాల‌ను ప్ర‌భావితం చేయ‌నున్నాయి.

ఇంత‌వ‌ర‌కూ టీడీపీ కూడా జ‌గ‌న్ మంత్రుల‌ను అంత ఘోరంగా తిట్ట‌లేదు. అయ్య‌న్న మిన‌హా ఎవ్వ‌రూ అలా తిట్ట‌లేదు. ఎందుక‌నో నిన్న ప‌వ‌న్ తీవ్ర ప‌ద‌జాలం వాడారు. వాటి ప‌ర్య‌వ‌సానాలు, ప‌రిణామాల‌పై అంత‌టా ఆందోళ‌న రేగుతున్న త‌రుణాన జ‌గ‌న్ ఏమంటారో అన్న‌ది సందిగ్ధంగా మారింది. రేప‌టి వేళ సినిమా కూలీలు  ఏమైపోతారో అన్న ఆవేద‌న‌లో ప‌వ‌న్ మాట్లాడినా వాటిని అలా అర్థం చేసుకోవ‌డం అన్న‌ది జ‌ర‌గ‌ని ప‌ని. దీంతో ప‌వ‌న్ ఇరుక్కుపోతారు. లేదా డైలామాలో జ‌గ‌న్ ఉండిపోతారు? న్యాయ స్థానాల ద్వారా కాకుండా చ‌ర్చ‌ల ద్వారానే స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకోవాల్సిన త‌రుణం వ‌చ్చేసింది.


ఏపీ సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యాలే ప‌రిశ్ర‌మ‌ను కొంప ముంచేలా ఉన్నాయి.ఇవి గతంలో లేనివి అయితే తెలివిగా కొంత‌మంది త‌మ అనుకూల వ‌ర్గాన్ని తెర‌పైకి తెచ్చి వైసీపీ స‌ర్కారు నాట‌కాలాడిస్తుంద‌ని జ‌న‌సేన అభిమానులు మండిప‌డుతున్నారు. కోట్ల మందిని ప్ర‌భావితం చేసే సినిమా, ల‌క్ష‌ల మందికి భోజ‌నం పెడుతుంద‌ని, అలాంటి ప‌రిశ్ర‌మకు అన్యాయం చేయ‌కండ‌ని వేడుకుంటున్నారు మ‌రికొంద‌రు. ప‌వ‌న్ కార‌ణంగా జ‌గ‌న్ డైలామాలో ప‌డిపోయారు. ఏం చేసినా ఈ సారి ఓట్ల  రూపంలో వైసీపీకి భారీ న‌ష్టం రావ‌డం త‌థ్యం.


 
సినిమా ఎలా ఉన్నా ప‌వ‌న్ మాట‌లు అదిరిపోయాయి. రిపబ్లిక్ అన్న టైటిల్ కు జ‌స్టిఫికేష‌న్ ఇచ్చిందే ప‌వ‌న్. మీరు రాజ్యాంగ స్ఫూర్తిని కొల్ల‌గొడుతున్నార‌ని, ప‌వ‌న్ పంచెక‌ట్టులో చెప్పిన డైలాగ్స్ ఫ‌క్తు పొలిటీషియ‌న్ ను మించి పోయాయి. ఎన్న‌డూ లేనంత ఆవేశం నిన్న క‌ట్ట‌లు తెంచుకుంది. ఆయ‌న ఆవేశ‌మో ఆవేద‌నో ఏదో ఒక‌టి ప్ర‌భుత్వాలు అర్థం చేసుకుంటాయా అన్న‌ది పెద్ద ప్ర‌శ్న‌. లేదా ఏపీ సీఎంపై సినిమా ప‌రిశ్ర‌మ కోర్టులను ఆశ్ర‌యించి న్యాయ పోరాటం ఏమ‌యినా చేస్తాయా? అన్న‌దిక ఆసక్తికి కార‌ణం.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

ap