జ‌గ‌న్ అనే ఓ పెద్ద రాజ‌కీయ నాయ‌కుడ్ని ఎదుర్కొనేందుకు, ఢీ కొనేందుకు పవ‌న్ త‌న శ‌క్తిని కూడ‌దీశారు. ఇలా ఎందుకు చేశారో కానీ మొత్త‌మ్మీద ఆయన మాట‌ల ప్ర‌భావం రానున్న రెండున్న‌రేళ్ల కాలంలోనూ చిత్ర ప‌రిశ్ర‌మ‌పై ఉంటుంది. ఒక‌వేళ జ‌గ‌న్ మ‌ళ్లీ అధికారంలోకి రాకుండా ఉంటే పర్లేదు. వ‌స్తే మాత్రం చిత్ర ప‌రిశ్ర‌మ‌కు మ‌రిన్ని గండాలు త‌ప్ప‌వు. ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్ మాట‌లు వినేందుకు బాగున్నాయి కానీ అవ‌న్నీ కొన్ని వ‌ర్గాలపై తీవ్ర ప్ర‌భావం చూపుతాయి. ఇప్ప‌టికే వీటిపై వైసీపీ ఎలా స్పందించాలో అని డైలామాలో ఉంది. ఏం మాట్లాడితే ఏం త‌గాదా వ‌స్తుందో అని పున‌రాలోచ‌న చేస్తుంది. ఇప్పుడు వీటికి తోడు సాటి సినిమా హీరోల‌పైన కూడా ఆయ‌న కొన్ని వ్యాఖ్య‌లు చేశారు. అవి ఇంకొన్ని త‌ల‌నొప్పుల‌కు తావిచ్చేలా ఉన్నాయి. మొత్తానికి గులాబ్ తుఫాను నిన్న‌టి వేళ ఒక రోజు ముందుగానే వ‌చ్చిన విధంగా ఉంది. అంత‌టి దుమారం రేపేలా ఆయ‌న వ్యాఖ్య‌లు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే ఆర్ ఆర్ ఆర్ సినిమాతో నంద‌మూరి, మెగా కుటుంబాలు క‌లుస్తున్నాయి అంటే ఇదొక గొడ‌వ కొత్త చిచ్చుకు కార‌ణం కానుంది.



రిపబ్లిక్ సినిమా హీరో ప‌వ‌న్ క‌ల్యాణా అన్నంత రేంజ్ నిన్న రాజకీయ ప్ర‌సంగం న‌డిచింది. తేజూ సినిమాకు ప‌వ‌న్ అతిథిగా రావ‌డం ఓ గొప్ప విష‌యంగా మెగాభిమానులు భావించారు. కానీ మీడియాకు ఝ‌ల‌క్ ఇస్తూ లైవ్ ను ఎక్క‌డా ఆపేందుకు వీలే లేకుండా ఆయ‌న మాట్లాడిన తీరు విప‌రీతంగా ఆక‌ట్టుకుంది జ‌న‌సైనికుల‌ను. దీంతో ఒక‌వేళ రేప‌టి వేళ ఈ సినిమాను ఓటీటీకి ఇచ్చినా, థియేట‌ర్ కు ఇచ్చినా, లేదా రెంటికీ ఇచ్చినా స‌క్సెస్ చేయాల‌న్న క‌సి జ‌న సైనికుల్లో  పెరిగిపోయింది. జ‌గ‌న్ పై ఉన్న వ్య‌తిరేక‌త అంతా జ‌న సేనాని అభిమానులు క‌లెక్ష‌న్ల రూపంలో చూపించేందుకు సిద్ధం అవుతున్నారు. సినిమాకు డ‌బుల్ పాజిటివ్ రిజ‌ల్ట్ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. ఇవ‌న్నీ ఓ ఎత్తైతే నిన్న ఓ ప్ర‌ముఖ సినీ కుటుంబాన్ని ఆయ‌న టార్గెట్ చేశారు. నంద‌మూరి కుటుంబాన్ని నేరుగా కాక‌పోయినా, ప‌రోక్షంగా కొన్ని మాట‌లు అన్నారు. మంచు కుటుంబాన్నీ అన్నారు. ఇవే ఇప్పుడు కొత్త త‌ల‌నొప్పుల‌కు కార‌ణం కానున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

ap