నంద‌మూరి, కొణిదెల కుటుంబాలు ఇప్పుడిప్పుడే ఒక్క‌ట‌వుతున్నాయి. అందుకు ఆర్ ఆర్ ఆర్ సినిమా ఓ కార‌ణం. ఇంకా కొన్ని కార‌ణాలు కూడా ఉన్నాయి. బాబాయ్ బాల‌కృష్ణ‌కు  ఎప్ప‌టి నుంచో ద‌గ్గ‌ర అవుదామ‌ని, ఆయ‌న‌కు స‌న్నిహితంగా ఉండాల‌ని తార‌క్ భావిస్తున్నాడు. కానీ తాజా వ్యాఖ్య‌లు పూర్తిగా నంద‌మూరి కుటుంబంలోనూ, బాబాయ్ - అబ్బాయ్ సంబంధాల‌పైనా తీవ్ర ప్ర‌భావం చూపుతాయి. ఇది నిజం! అదేవిధంగా ఆర్ ఆర్ ఆర్ సినిమా క‌లెక్ష‌న్ల‌పైనా ఈ ప్ర‌భావం ఉంటుంది. ఏదేమైనా ఆవేశ పూరితంగా ప‌వ‌న్ మాట్లాడిన మాట‌లు అభిమానుల‌ను అల‌రిస్తాయి. కాద‌నం. అది ప‌వ‌న్ గారి ఆవేద‌న. కాద‌నం కానీ కుటుంబాల్లో వివాదాల‌కు తావిచ్చే వ్యాఖ్య‌లు ప‌వ‌న్ చేయ‌కూడదు. వాస్త‌వానికి నంద‌మూరి కుటుంబం ప‌వ‌న్ ను టార్గెట్ చేసి మాట్లాడింది ఏమీ లేదు. అలాంట‌ప్పుడు ఎందుక‌ని పాత గొడ‌వ‌లు తవ్వితీయ‌డం. చిరూ మాదిరిగానే సామ‌రస్యంగా వెళ్లిపోవ‌డంలోనే అస‌లు వివాదానికి సిస‌లు ప‌రిష్కారం ఉంది.జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆవేశ‌పూరిత ప్ర‌సంగం కార‌ణంగా అనేక వివాదాలు వ‌స్తున్నాయి. ముఖ్యంగా నంద‌మూరి కుటుంబంను కూడా ఆయ‌న టార్గెట్ చేశారు. సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యాన్ని ఇప్ప‌టిదాకా ఎక్క‌డా బాల‌య్య వ్య‌తిరేకించ‌లేదు. ఆ మాట‌కు వ‌స్తే సినిమా ప‌రిశ్ర‌మ నుంచి ఎదిగివ‌చ్చిన రోజా కూడా ఎక్క‌డా స్పందించ‌లేదు. ఆ నిర్ణ‌యం మంచిద‌ని కానీ చెడ్డ‌ద‌ని కానీ చెప్ప‌లేదు ఆమె. దీంతో వివాదం ఇంకా పెరిగిపోయింది. జ‌గ‌న్ న‌మ్ముకున్న చాలా మంది నిర్మాత‌లు కూడా పెద్ద‌గా స్పందించ‌లేదు. అందుకు కార‌ణాలు ఏమ‌యినా చ‌ర్చ‌ల ద్వారా వివాదాల‌ను ప‌రిష్క‌రించుకునేందుకు కొంత లాబీయింగ్ ను న‌డుపుతున్నారు. ఈ ద‌శ‌లో ఎటూ కాకుండా చేసేశాడు ప‌వ‌న్ అన్న అభిప్రాయం కూడా ఇండ‌స్ట్రీలో కొంద‌రి నుంచి వ‌స్తుంది. ఎదురుగా దిల్ రాజును ఉంచుకుని చేసిన వ్యాఖ్య‌లు ఎలా ఉన్నా అవి ఆయ‌న కోట్ల పెట్టుబ‌డిపై ప్ర‌భావితం చేస్తాయి అన్న‌ది నిజం. మొన్న‌టి వ‌కీల్ సాబ్ సినిమానే ఇందుకు నిద‌ర్శ‌నం. వాస్త‌వానికి వ‌కీల్ సాబ్ సినిమా టికెట్ రేట్లు ఒక్క‌సారిగా ఏపీ ప్ర‌భుత్వం త‌గ్గించ‌కుండా ఉంటే అతి త‌క్కువ కాలంలోనే ఆ సినిమా వ‌సూళ్లన్న‌వి వంద కోట్ల క్ల‌బ్ లో చేరిపోయేవి. కానీ క‌రోనా సెకండ్ వేవ్ ముంచుకుని రావ‌డం, వీటికితోడు జ‌గ‌న్ నిర్ణ‌యాలు వెలువ‌డ‌డం అన్న‌వి సినిమా కలెక్ష‌న్ల‌పై తీవ్ర ప్ర‌భావం చూపాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap