అఫ్ఘానిస్థాన్‌ దేశం లో అత్యంత దారుణ పరిస్థితులు నెలకొన్న విషయం తెల్సిందే.  అఫ్ఘానిస్థాన్‌ను తాలిబన్లు ఆక్రమించుకున్నాక...  అనేక కష్టాలు పడుతున్నారు అఫ్ఘానిస్థాన్‌   ప్రజలు. మాములు ప్రజల నుంచి ధనిక ప్రజలను కూడా కష్టపెడుతున్నారు తాలిబన్లు. ఆరాచక నిబంధనలను అమలు చేస్తూ... దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. ఇప్పటికే చాలా రంగాలపై ఆంక్షలు విధించిన తాలిబన్‌ రాక్షసులు.... ఇప్పుడు మీడియా పై కూడా ఆంక్షలు విధిస్తున్నారు. మీడియా స్వేచ్ఛను హరిస్తూ... 11 కొత్త రూల్స్‌ జారీ చేశారు తాలిబన్లు రాక్షసులు. ఇకపై మతానికి వ్యతిరేకంగా గాని, ప్రభుత్వ పెద్దలను అవమానపరిచే వార్తలు గాని ప్రచురించ కూడదు.

ప్రభుత్వ మీడియా కార్యాలయాల సమన్వయంతో జర్నలిస్టులు వార్తలు, ఫీచర్ కథనాలు రాయాల్సి ఉంటుంది. తాలిబన్ల కొత్త రూల్స్‌ చూసి అఫ్ఘానిస్థాన్‌లోని జర్నలిస్టులు భయపడిపోతున్నారు. అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే... రోజు వారీ వార్తలు ఇవ్వలేని పరిస్థితుల్లో 150కి పైగా మీడియా సంస్థలు మూతపడ్డాయి. పలు ప్రముఖ వార్తాపత్రికలు కూడా ముద్రణ ఆపేసి...  ఆన్‌లైన్‌ ఎడిషన్లు ఇస్తున్నాయి.  ప్రభుత్వ ఏర్పాటుకు ముందు మహిళలు, మీడియా హక్కుల్ని గౌరవిస్తామన్న తాలిబన్లు... ఆ మాటలు నిలబెట్టుకోలేదు. అనేక మంది విద్యార్థినులు తమ చదువులకు దూరమయ్యారు. ఎందరో మహిళలు ఉద్యోగాలు కోల్పోయి... కుటుంబాల్ని ఎలా పోషించుకోవాలో అర్థంకాని పరిస్థితిలో ఉన్నారు.

మంత్రివర్గంలో మహిళలకు చోటు కల్పించలేదు సరికదా... ఆడవాళ్లు ఉన్నత పదవులు చేపట్టేంత సమర్థులు కారని తేల్చి చెప్పారు తాలిబన్లు. మహిళలు పిల్లల్ని కంటే సరిపోతుందంటూ చులకన చేశారు. ఒక రకంగా తాలిబన్ల దృష్టిలో మహిళలు మనుషులే కాదు. తమ స్వేచ్ఛను హరించొద్దంటూ రోడ్లపైకి వచ్చి గళమెత్తిన మహిళ పై దాడులు చేస్తున్నారు ఈ దుర్మార్గులు. ఇక ఇలాంటి ఘటనలు కవరేజ్‌ చేస్తోన్న మీడియా పై ఇప్పుడు ఆంక్షలు పెట్టడం..కొసమెరుపు. ఇక ఈ తాలిబన్ల సామ్రాజ్యానికి ఎప్పుడు అంతం వస్తుందోనని ... ఆఫ్ఘన్‌ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: