తెలుగు దేశం పార్టీ లో సీనియర్ లు బాబొరికి దండం పెట్టి మరి మమ్మల్ని వదిలేయండి అంటూ వేడుకుంటున్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రాభల్యం ప్రజలలో తీవ్రంగా ఉన్నా కూడా వారికి వ్యతిరేకంగా లేనిపోనివి సృష్టించి ఏదో ఒక రగడ అన్ని ప్రాంతాలలో చేస్తూనే ఉంటె టీడీపీకి నిరంతరం ప్రచారం దక్కుతుందని, అది వచ్చే ఎన్నికలలో ఎంతో కొంత లభిస్తుందనే నీచమైన ఆలోచనలు అమలు చేయాలనీ వారిపై వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేక ఆ పార్టీ సీనియర్ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ప్రభుత్వం చేసే ప్రతిపనిపై లేనిపోనివి అంటగట్టి చెపుతుంటే ప్రజలు చూసే చూపులు భరించలేకపోతున్నామని అవి ఎవరికి చెప్పుకోలేక సొంత ప్రాంతంలో దాక్కొని బ్రతకాల్సి వస్తుందని వారందరు వాపోతున్నారు.

ఇవన్నీ బాబుకు, ఆయన తనయుడికి చెప్పినా వినకుండా చేయాల్సిందే అని ఆదేశాలు ఇస్తుండటం తో చేసేది లేక తప్పుకుంటున్నట్టు ఎవరికి వారు సమస్యకు పరిష్కారం వెతుక్కుంటున్నారు. ఇలాంటి అబ్బద్దపు ప్రచారం చేస్తుండటంతో ప్రాంతీయంగా ఉన్న తమవారే  ఇదేంపని అని అడుగుతుంటే తలెత్తుకోలేక పోతున్నాం, తమకు ఉన్న కాస్త అభిమానం కూడా ద్వేషంగా మారిపోతుందని అధినాయకత్వానికి చెప్పుకున్నప్పటికీ లాభం కనిపించడం లేదు. దీనితో ఒక్కొక్కరుగా ఆ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇప్పటికే చాలా మంది సీనియర్స్ వచ్చే ఎన్నికలలో పోటీకి కూడా దుఆరంగా ఉంటున్నట్టు పార్టీ అధినాయకత్వానికే స్పష్టం చేసేశారు.  

ఇన్ని చెబుతున్నప్పటికీ అధినాయకత్వం తీరు మాత్రం మారడంలేదు. ఎన్ని గిమ్మిక్కులు చేసినప్పటికీ ప్రభుత్వం చేసే ప్రజారంజక పాలన ముందు తేలిపోతుండటంతో తమపరువు తామే తీసుకున్నట్టు టీడీపీ పార్టీ పరిస్థితి మారిపోయింది. అందుకే గతంలో క్రియాశీలకంగా ఉన్న నేతలు ఎవరూ ప్రస్తుతం టీడీపీ తో పనిచేయడానికి సుముఖంగా లేరు. గతంలో టీడీపీ గెలిచినప్పుడు ఎప్పుడూ బాబుకు తోకల ఉన్న నారాయణ మొదలుకొని గంటా, రాజమండ్రి నేత మురళీమోహన్, కేశినేని, బుచ్చయ్య చౌదరి ఇప్పటికే బాహాటంగానే దూరంగా ఉంటామని వెల్లడించారు. ఇక గత ఎన్నికలలో గెలిచిన 23మందిలో వంశి, మద్దాళి గిరి, వాసుపల్లి గణేష్, కరణం బలరామకృష్ణ లు కూడా దూరం అయిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: