పవన్ కళ్యాణ్ మరోసారి గర్జించారు. ఎప్పుడో పార్టీ పెట్టినప్పుడు ఇలా ఘాటుగా మాట్లాడారు, మళ్ళీ ఇప్పుడే అంత అక్కరతో మాట్లాడారు. సందర్భం ఏదైనా ఆయన మాట్లాడారు కాబట్టి సేన పండగ చేసుకుంటుంది. అసలు ఆయన మాట్లాడింది ఏమిటో కూడా సరిగా అర్ధం చేసుకోకుండా ఎవరి అర్ధం వాళ్ళు వెతుక్కొని వార్తల ప్రచారం చేసేస్తున్నారు. ఇదంతా సినీ పరిశ్రమపై ప్రేమతోనేనా ఇంకేమైనా ఉందా .. పవన్ సాబ్ కే తెలియాలి. ఎన్నడూ లేనిది ఇంత ఘాటుగా స్పందించారంటే ఇంతగా ఎవరు మోటివేట్ చేసి ఉంటారో మరి. ఒకసారి అన్నను విభేదించి పార్టీ పెట్టారు.. మళ్ళీ ఇన్నాళ్లకు అదే చేస్తున్నారు. వారి మూడ్ ను బట్టి మాత్రమే  స్పదింస్తున్నారు, ప్రజాక్షేత్రంలోకి రావాలనే వారు సొంత మూడ్ ను పట్టుకొని వేలాడటం అస్సలు పనిచేయదు. కేవలం ప్రజా ప్రయోజనాల కోసమే పనిచేస్తేనే రాజకీయ నేత అంటారు.

అసలు ఈ రాద్ధాంతం అంతా సినిమా టిక్కెట్ల అమ్మకం గురించి అయితే దాని పూర్తివివరాలు తెలుసుకొని మాట్లాడాలి. ఏపీలో సినిమా టిక్కెట్లు ప్రభుత్వం అమ్ముతుందనేది కొందరు సృష్టించిన వార్త. నిజానికి అక్కడ జరుగుతుంది థియేటర్లలో ఇష్టానికి పెంచేసిన టిక్కెట్ల ధరలను నియంత్రించడానికి పోర్టల్ మాత్రం ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. దాని నుండి ఆయా థియేటర్లు టిక్కెట్లు అమ్ముకోవాల్సి ఉంటుంది. దీనివలన అధికధరలకు ఆస్కారం ఉండదు అంతే తప్ప రాష్ట్ర ప్రభుత్వం టిక్కెట్లు అమ్మబోదు. ఈ మాత్రం వార్తపై స్పష్టత లేకుండా ఎవడో వార్తను తప్పుదోవ పట్టించేట్టు రాస్తే దాన్ని పట్టుకొని సాబ్ లు మైకు ముందుకు వస్తే వాళ్ళ స్థాయి దిగజారిపోతోంది తప్ప ఒరిగేది ఏమి ఉండబోదు.  

నిజానికి ఇప్పుడు ఏపీలో టీడీపీ అధికారంలో ఉండి ఆ ప్రభుత్వం ఈ టిక్కెట్ల అమ్మకం చేస్తే అబ్బో ఎంత గొప్ప పని తలపెట్టారు అనేవాళ్ళు. కానీ చేసింది ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం కాబట్టి దానితో మొదటి నుండి సయోధ్య లేదు కాబట్టి అసలు అది చేస్తున్న పని ఏమిటో కూడా పూర్తిగా తెలుసుకోకుండా నోరుపారేసుకుంటున్నారు. ఇది ఆ పార్టీకి ఇంకాస్త చెడు చేస్తుందే తప్ప ఉపయోగం ఏమి ఉండబోదు. ఇప్పటికైనా దొంగ వార్తలు నమ్మి కాకుండా నిజానిజాలు తెలుసుకొని మైకు ముందుకు వస్తే బాగుంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాజకీయాలలో తొందరపాటు పనికిరాదని, అది పార్టీకే చేటు తెస్తుందని వారు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: