ప్రపంచ దేశాల నుండి గుర్తింపు కోసం ఎదురుచూస్తున్న తాలిబన్ లు తమ తాత్కాలిక ప్రభుత్వం అసలు విధానాలు అమలు చేయడం ప్రారంభించింది. కఠిన శిక్షలు, దారుణ ఆంక్షలు, నిర్దయ లాంటివి ప్రదర్శిస్తూ తమ ఉనికిని చాటుకుంటున్నారు. తమకు ఎవరు చట్టాల గురుంచి చెప్పాల్సిన పనిలేదని, తాము చేసిందే చట్టం, చెప్పిందే వేదం అంటూ రోజుకొక దాష్టికానికి పాల్పడుతున్నారు. ఆఫ్ఘన్ ప్రజలు మాత్రం ఆకలి కేకలతో అల్లాడి పోతున్నారు. ఇప్పటికే ఆయా దేశాలు తమ సాయాన్ని ప్రజలకు ప్రకటించినప్పటికీ, వాళ్లకు తాలిబన్ల నుండి స్వేచ్ఛ తప్ప మరొకటి దక్కినా ప్రయోజనం ఉండబోదని వాపోతున్నారు.

తాలిబన్ లు తాజా కేబినెట్ లో ప్రపంచ దేశాలు ఎప్పటి నుండో వెతుకుతున్న ముష్కరులు దర్శనం ఇవ్వడంతోనే వారి పాలనా విధానం ఎలా ఉంటుందో అందరికి అర్ధం అయ్యింది. దానిప్రకారమే ఇప్పుడు రోజూ అక్కడ ఒక్కో ఘటన చోటుచేసుకుంటున్నది. ఇప్పటికి అమెరికా తమ వారిని తరలిస్తున్న సందర్భంగా వస్తున్న విమానాల వెంట ఆఫ్ఘన్ లు పరుగులు పెడుతూ ఎక్కడో అక్కడ కూర్చొని దేశం దాటేయాలి అని ప్రయత్నిస్తున్నారంటేనే తాలిబన్ పాలన ఎలా ఉండబోతుందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పటికి వారి నిజస్వరూపం పూర్తిగా బయట పెట్టబోవటానికి కారణం, ప్రపంచ దేశాలు తమని గుర్తించడానికి వేచి చూడటమే. అదే జరిగిపోతే వాళ్ళ అసలు రూపాలు బయటకు వచ్చేస్తాయి.

తాజాగా తాలిబన్ లు దాదాపు 150 మీడియా సంస్థలపై 11 సూత్రాల ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షల ప్రకారం తాము ఏది చెబితే అదే రాయాలి తప్ప, ఇష్టానికి వార్తలు రాయడానికి వీలులేదు. ఈ పద్దతి ఎక్కడో విన్నట్టే ఉంది కదూ, ఇలాంటి ఆదేశాలు చైనా లో కూడా అమలు అవుతున్నాయి. అంటే దీనివెనుక ఎవరు ఉన్నది అర్ధం చేసుకోవచ్చు. అసలు  తాలిబన్ లు ఆఫ్ఘన్ ను ఆక్రమించిన వెంటనే అనేక మంది జర్నలిస్టులు దేశం విడిచిపెట్టి వెళ్లిపోవడం చూశాం. మిగిలిన వాళ్ళను చంపకుండా ఉండాలంటే, వాళ్ళు చెప్పిందే వార్తగా రాయాలని తాలిబన్ లు స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. అనేక పత్రికలూ ఇప్పటికే మూతపడ్డాయి. పత్రికా స్వేచ్ఛ గురించి ఇప్పుడు మాట్లాడండి చూద్దాం!

మరింత సమాచారం తెలుసుకోండి: