తూర్పు మధ్య బంగాళాఖాతంలో గులాబ్ తుపాన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కంగారు పెడుతుంది. గోపాలపూర్ కు 270కిమీ, కళింగపట్నానికి 330 కిమీ దూరంలో కేంద్రీకృతం అయి ఉంది ఈ తుఫాన్. ఈ రోజు అర్ధరాత్రి కళింగపట్నం - గోపాలపూర్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అధికారులు ఉత్తరాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని అధికారులు పేర్కొన్నారు. మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని జాగ్రత్తగా ఉండాలని సూచనలు చేసారు.

మధ్యాహ్నం నుంచి ఉత్తరాంధ్ర  తీరం వెంబడి గంటకు 75 - 95 కీమీ వేగంతో బలమైన ఈదురగాలులు  వీస్తాయని తెలిపారు. సముద్రం అలజడిగా ఉంటుంది అని అన్నారు.. మత్స్యకారులు రేపటి వరకు వేటకు వెళ్ళరాదు అని ఆయన సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని అధికారులు హెచ్చరికలు చేసారు.  రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అని పేర్కొన్నారు. తుపాను పరిస్థితులపై సీఎం ఆరా తీసి అధికారుల నుంచి వివరాలు సేకరించారు. అన్నిరకాల చర్యలు తీసుకోవాలని ఆదేశం  ఇచ్చారు.

 తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశామని, తీసుకోవాల్సిన చర్యలపై వారికి తగిన సూచనలు చేశామని సీఎం కు ఈ సందర్భంగా అధికారులు వివరించారు. గ్రామ సచివాలయాల వారీగా కంట్రోలు రూమ్స్‌ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. విశాఖ, శ్రీకాకుళం జిల్లాల్లో విపత్తు నిర్వహణ సిబ్బందిని కూడా సిద్ధంచేశామన్న అధికారులు.... అవసరమైన చోట శిబిరాలు తెరిచేందుకు కలెక్టర్లు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నారని సిఎం జగన్ దృష్టికి తీసుకు వెళ్ళారు. తుపాను అనంతర పరిస్థితులపైనా అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. తీరందాటిన తర్వాత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఎప్పటికప్పుడు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: