ఏపీలో త‌గువు మామూలుగా లేదు. ర‌చ్చ ర‌చ్చ చేసేలానే ఉంది. మంత్రుల‌ను అన‌రాని మాట‌లూ అన్నారు అని వైసీపీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోంది. టికెట్ విధానాన్ని గాడీలోకి తీసుకురావ‌డంలో తాము విఫ‌లం అయితే అందుకు త‌గ్గ కార‌ణాలు ఏంట‌న్న‌వి చెబితే దిద్దుకుంటామ‌ని, అస‌లు నిర్ణ‌యం అమ‌లు ఏమీ లేకుండానే ఇలా అన‌డం త‌ప్పు అని అంటున్నారు.


మంత్రుల‌ను మ‌రో సారి టార్గెట్ చేయ‌డంతో ప‌వ‌న్ వార్త‌ల్లో నిలిచారు. అలా చేయ‌డం వ‌ల్ల టీడీపీకి లాభమే కానీ ఇండ‌స్ట్రీకి ఎటు వంటి ఉప‌యోగం ఉండదు. మంత్రుల భాష‌పై ఒక‌ప్పుడు మాట్లాడిన ప‌వ‌న్ ఇప్పుడు అదే భాష‌లో ప్ర‌సంగించ‌డంలో అర్థం ఏమీ లేద‌ని ప‌లువురు అంటున్నారు. స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించే ప‌ద్ధ‌తి ఇది కాద‌ని, ఇలా కాకుండా మ‌రికొంత స‌మయం సంయ‌మ‌నం పాటించి త‌రువాత మాట్లాడితే  కాస్త‌యినా ప‌రిస్థితిలో మార్పు ఉండేద‌ని కూడా కొంద‌రు సినిమా వ‌ర్గాలు మాట్లాడుకుంటున్నా యి. ప‌వ‌న్ ఎన్న‌డూ లేని విధంగా ఒక సినిమా స్టేజ్ పై  తిట్ల దండ‌కం అందుకోవ‌డంతో వైసీపీ వ‌ర్గాలు భ‌గ్గు మంటున్నాయి. ఈ విధంగా ప్ర‌వ‌ర్తించ‌డంతో న‌ష్ట‌పోయేది ఇండ‌స్ట్రీనే కాని మ‌రొక‌రెవ్వ‌రూ కాద‌ని, ఒక‌వేళ మాట్లాడినా, నిర‌స‌న‌లు చెప్పినా కూడా ఓ ప‌ద్ధ‌తి ప్రకారం చేయాలే కానీ  బ‌హిరంగ వేదిక‌పై  తిట్ట‌డం వ‌ల్ల ఇంకొక‌రు దీన్నొక అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నార‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.


జ‌న‌సేనాని ప‌వ‌న్ నిన్న చేసిన వ్యాఖ్య‌ల కార‌ణంగా రాజ‌కీయంగా విభిన్న స్వ‌రాలు వినిపిస్తున్నాయి. ఉద్వేగ‌పూరిత ప్ర‌సంగాలు చేసినంత మాత్రాన స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రానికి నోచుకోవు అని, ఏ విష‌యంలో అయినా సామ‌ర‌స్య ధోర‌ణి ఓ అడుగు ముందుకు వేసి న‌డిపేందుకు స‌హ‌క‌రిస్తుంద‌ని కొంద‌రు హిత‌వు చెబుతున్నారు. ప్ర‌థ‌మావేశంలో ఏమ‌యినా మాట్లాడొచ్చు కానీ త‌రువాత ప‌రిణామాలు ఎలా ఉంటాయి అన్న‌ది ఊహించుకోగ‌ల‌గాలి. ఇదే ఇప్పుడు క‌ష్టంగా మారింది. ప్ర‌థమ కోపంలో కూడా ఏమ‌యినా మాట్లాడొచ్చు. కానీ ఆ త‌రువాత త‌న వారికి ,  త‌న సొంత మ‌నుషుల‌కూ ఇబ్బంది ఉంటుంది అన్న‌ది కూడా గ్ర‌హించాలి. ఏపీ స‌ర్కార్ తీసుకున్న నిర్ణ‌యాల‌పై నిర‌స‌న వ్య‌క్తం చేయ‌డం త‌ప్పు కాదు కానీ, ఆ నిర్ణ‌యాల వెనుక ఎవ‌రు ఉన్నారు, అందుకు దారి తీసిన ప‌రిణామాలేంటి అన్న‌వి కూడా ఆలోచించుకుని తీరాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap