తెలంగాణా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న విమర్శలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని బాగా ఇబ్బంది పెడుతున్నాయి. పార్టీ ని బలోపేతం చేయడానికి వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడానికి ఆయన ఇప్పుడు పాదాయత్రను ఎంచుకున్నారు. సీఎం కేసీఆర్ కు బండి లేఖ రాసారు. దళిత బంధు ని అమలు చేస్తున్న నేపధ్యంలో మరో డిమాండ్ కూడా ఆయన ముందుకు తెచ్చారు. బీసీ బంధును అమలు చేయాలని డిమాండ్‌ చేసిన సంజయ్... ముగ్గురు కాదు.. క్యాబినెట్ లో 8మంది బీసీలకు స్థానం కల్పించాలి అని లేఖలో ప్రస్తావించారు.

 అర్హులైన  ప్రతి  బీసీ కుంటుంబానికి  10 లక్షలు  ఆర్ధిక  సహాయం  అందించాలి అని ఆయన కోరారు. జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీల సంక్షేమం కోసం బీసీ బంధు పథకం ప్రారంభించాలి అని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. బీసీలపై టీఆర్ఎస్ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమను వీడాలని సిఎం కేసీఆర్ కు ఆయన విజ్ఞప్తి చేసారు. టీఆర్ఎస్ ప్రభుత్వం  హయంలో బీసీ సబ్ ప్లాన్ అటకెక్కింది అని బండి సంజయ్ విమర్శలు చేసారు. బీసీ సబ్  ప్లాన్ కు చట్ట భద్రత  కల్పించాలి అని అన్నారు ఆయన.

46 బీసీ  కులాలకు నిర్మిస్తామనన్న ఆత్మ గౌరవ భవనాల అడ్రస్ ఎక్కడ? అని ఆయన ప్రశ్నించారు. 3,400 కోట్ల ఫీజు  రీయింబర్సుమెంట్  బకాయిలను వెంటనే విడుదల చెయ్యాలి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసారు. చేనేత  కార్మికులకు  భీమా, హెల్త్  కార్డులు  మంజూరు చేయాలి అని ఆయన కోరారు. గీత  కార్మికులను ఆదుకోవడంతో పాటు.. రజకుల‌ కోసం దోబీ ఘాట్ లను నిర్మించాలి అని లేఖలో ప్రస్తావించారు. నాయి   బ్రాహ్మణులకు  200 యూనిట్ల  కరెంటును  ఉచితంగా ఇవ్వాలి  అని అన్నారు. ఎంబీసీ కార్పొరేషన్ కు సమృద్ధిగా నిధులు కేటాయించాలి అని కేసీఆర్ విజ్ఞప్తి చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts