తెలంగాణాలో విద్యార్థులు నియామకాలు జరగటం లేదని వాపోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి విడుదల చేసిన నోటిఫికేషన్ లు చాలా తక్కువే. తెలంగాణ ఆవిర్భావం జరగగానే తమ భవితవ్యం మారిపోతుందని కలలు కన్న వారికి నిరుత్సహమే మిగిలింది. పరిస్థితులు అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి అన్నట్టుగా మారిపోయాయి. మొన్నటి వరకు పరాయివాడు దోచుకుంటే, ఇప్పుడు తమవాడే దోచుకుంటున్నాడని పలువర్గాలు ప్రభుత్వంపై అసంతృప్తితో రగిలిపోతున్నాయి. కేవలం ఎన్నికల సమయంలో తప్ప నేతలు ప్రజల ముఖం చూడటం లేదని తెరాస నేతలపై ఇప్పటికే విపక్షాలు కూడా దుమ్మెత్తి పోస్తున్నాయి.

ఒక్కసారి అధికారంలోకి వస్తేనే వంశానికి తగ్గట్టు సంపాదించుకునే రాజకీయ నేతలు ఇన్నేళ్ళుగా అధికారంలో అదికూడా ఆర్థికంగా మిగులు బడ్జెట్ గా ఉన్న రాష్ట్రంలో ఎంత నొక్కేసి ఉంటారు అనేది ప్రజలు ఆలోచించుకోవాలని విపక్షాలు తెరాస ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. ఇప్పటికైనా ప్రజలు, ముఖ్యంగా యువత మేల్కొని ప్రభుత్వానికి బుద్ది చెప్పాలని వాళ్ళు పిలుపునిస్తున్నారు. రాష్ట్రాభివృద్ధి ఏమో కానీ, కేసీఆర్ కుటుంబం అంతా అభివృద్ధి చెందింది అని తాజా ఉపఎన్నిక ప్రచారంలో బీజేపీ సహా విపక్షాలు ప్రజలకు చెపుతున్నాయి.  

నియామకాలు చేసిందే లేదనేది ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటి వరకు మోస్తున్న విమర్శ అయితే తాజాగా తెలంగాణ విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు కూడా తెలియకుండా రహస్యంగా నియామకాలు చేపట్టడంపై ఆయా విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గుట్టుగా అవుట్ సోర్సింగ్ విధానంలో ఈ నియామకాలు జరిగినట్టు వారు చెపుతున్నారు. కనీసం నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా నియామకాలు ఎలా చేపడతారని విద్యార్థి సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ సంస్థలో ఇప్పటికే 270 మంది అవుట్ సోర్సింగ్ ద్వారానే పనిచేస్తున్నారు. ఇప్పుడు మరో 49 మందిని అదేవిధంగా నియమించడం వెనుక అక్రమాలు  జరిగాయంటూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఇలాంటి సంస్థలలలో నియామకాలు జరగాలి అంటే కనీసం ఉన్నత విద్య మండలి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది, అదికూడా లేకుండా నియామకాలు చేప్పట్టడంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: