దేశంలో వివిధ పరిస్థితుల వలన ప్రాంతీయ తీవ్రవాదం(నక్సలిజం) పెరుగుతూ వచ్చింది. పెట్టుబడి దారుల దాష్టికాల నుండి ఈ తిరుగుబాటు దారులు పుట్టుకొచ్చారు. అది కాస్తా అనేక మార్పులకు, రాజకీయాలకు లోనై దాడులు-ప్రతిదాడులతో ప్రతీకారానికే పరిమితం అయిపోయింది. బడుగు వర్గాల కోసం పోరాటం అని చెపుతున్నప్పటికీ ఇందులోనూ రానురాను కొన్ని పరిస్థితుల వలన విలువలు తగ్గిపోతూ వస్తుండటంతో కొందరు అవన్నీ విడిచి ప్రజారణ్యంలో కలిసిపోయారు. వారికి అధికారులు కూడా జీవనోపాధి చూపిస్తున్నారు.  అయితే ఇటీవల వీటి ప్రభావం ఎక్కువ అవుతుంది, కొత్తవారిని దళాలలోకి తీసుకుంటుండటం వింటున్నాం. మళ్ళీ వీళ్లు తమ ఉనికిని చాటుకోడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది రాజకీయ ప్రయోజనాల కోసం కాకుంటే మేలే, కానీ అందుకే అయితే ప్రజాజీవనం శాంతిని కోల్పోతుంది.

ఇక ప్రపంచంలో కూడా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. చాలా దేశాలు ఆధిపత్యం కోసం చూస్తున్నాయి తప్ప విశ్వశాంతి కోసం ఆరాటపడుతున్న వాళ్ళు తక్కువయిపోతున్నారు.  దీనితో ఆయా దేశాలు ఆయుధాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఈ నేపథ్యం ప్రాంతీయ, ప్రాపంచిక ఉగ్రవాదాన్ని పెంచి పోషించే విధంగా ఉండటంతో శాంతిని ఆశ్రయించే దేశాలు ప్రత్యాన్మాయ మార్గాలు వెతుక్కుంటున్నాయి. తాజా ఆఫ్ఘన్ ఆక్రమణ కూడా ఈ నేపథ్యంలో జరిగిందే కాబట్టి భారత్ కూడా తీవ్రవాద ప్రభావాన్ని ముందుగానే ఊహించి దానికి ఉన్న దారులన్నిటిని ముందస్తు జాగర్తగా నిలువరించేందుకు ప్రయత్నిస్తుంది.

ఈ నేపథ్యంలోనే అమిత్ షా నేతృత్వంలో నేడు ప్రాంతీయ తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల తో వామపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి తెలుగు రాష్ట్రాల ప్రతినిధులు సహా చత్తీస్ ఘడ్, ఝార్ఖండ్, ఒడిస్సా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల ప్రతినిధులు హాజరయ్యారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రాంతీయ తీవ్రవాద ప్రభావిత జిల్లాల సంఖ్యను 100 నుండి 70 కి తగ్గించింది. అందులోను 25 జిల్లాలలో మాత్రమే మావోల ప్రభావం కనిపిస్తుంది. 2014 నుండి 74 శాతం మావోల ప్రభావిత ఘటనలు తగ్గాయని హోమ్ శాఖ స్పష్టం చేసింది. నేడు సమావేశంలో ఆయా ప్రాంతాలలో మావోల ప్రభావం తగ్గించడం, అభివృద్ధి అంశాలపై చర్చించనున్నారు. ఈ సంక్షోభంలో ఆయుధాల వితరణ విపరీతంగా జరిగే అవకాశాలు ఉండటంతో అన్ని విధాలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రక్షణ, శాంతి విషయంలో కలిసి ముందుకు పోయే ప్రయత్నం చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: