ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ విష‌యంలో తాజాగా ఒక వితండ వాద‌న తెర‌మీదికి వ‌చ్చింది. పార్టీ సానుభూతిప‌రులు, అభిమానులు మాజీ నాయ‌కులు..ఇలా అనుకుంటున్నారు అంటూ ఓ వ‌ర్గం మీడియాలో క‌థ‌నాలు వ‌చ్చాయి. అయితే.. దీనిపై అధికారికంగా టీడీపీ నాయ‌కులు ఎవ‌రూ రియాక్ట్ కాలేదు. అయితే.. విష‌యం ఏంటంటే.. తాజాగా జ‌రిగిన ప‌రిష‌త్ ఎన్నిక‌ల‌ను టీడీపీ బ‌హిష్క‌రించింది. ఈ విష‌యాన్ని ప‌దే ప‌దే చెప్పుకొచ్చింది. ఎన్నిక‌ల నామినేష‌న్ల‌ స‌మ‌యంలో వైసీపీ నాయ‌కులు త‌మ వారిని బెదిరించారని, నామినేష‌న్ ప‌త్రాలు లాక్కున్నార‌ని.. సో.. ఈ ఎన్నిక‌ల్లో అన్ని రూపాల్లోనూ అధికార పార్టీ అక్ర‌మాల‌కు పాల్ప‌డింద‌ని.. ఎస్ ఈసీ కూడా నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వైసీపీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రించింద‌ని ఆరోపిస్తూ.. చంద్ర‌బాబు ఈ ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రించారు.

అయిన‌ప్ప‌టికీ.. అప్ప‌టికే టీడీపీ త‌ర‌పున అభ్య‌ర్థులు నామినేష‌న్లు వేసేయ‌డం.. కొంద‌రు వీటిని ఉప‌సంహ‌రించుకోక‌పోవ‌డం.. పైగా క్షేత్ర‌స్తాయిలో కీల‌క నాయ‌కులు, మాజీ మంత్రులు వీరిని ప్రోత్స‌హించ‌డం తెలిసిందే. దీంతో 700 ఎంపీటీసీల‌ను పార్టీ ద‌క్కించుకుంది. ఇక‌,కొన్ని చోట్ల జ‌న‌సేన‌తో పొత్తు పెట్టుకుని ఎంపీపీ ప‌ద‌వులు కూడా ద‌క్కించుకుంది. అయితే.. ఇప్పుడు దీనిని ప‌రిశీల‌న‌కు తీసుకున్న త‌ర్వాత‌.. స‌రికొత్త వాద‌న  తెర‌మీదికి వ‌చ్చింది. అదేంటంటే.. ప్ర‌స్తుతం టీడీపీ ఒంట‌రిగా ఉంది. అలా కాకుండా.. ప‌వ‌న్ నేతృత్వంలోని జ‌న‌సేన‌తో పోత్తు పెట్టుకుంటే.. ఖ‌చ్చితంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపు గుర్రం ఎక్కి అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంద‌ని.. త‌మ్ముళ్లు కూడా ఇదే చెబుతున్నార‌ని.. కొన్ని క‌థ‌నాలు వ‌చ్చాయి.

అంతేకాదు.. ప్ర‌జ‌లు కూడా జ‌న‌సేన‌-టీడీపీ కూట‌మిని ఆశీర్వ‌దిస్తున్నార‌ని.. దీనికి ప‌రిష‌త్ ఎన్నిక‌లే.. ప్రాతిప‌దిక అని.. సో.. ఈ రెండు పార్టీలూ క‌లిసి.. మిత్ర‌బంధం ఏర్పాటు చేసుకునేందుకు ఇదే స‌రైన స‌మ‌య‌మ‌ని కొన్ని వ‌ర్గాల మీడియా పెద్ద ఎత్తున ప్ర‌చారం ప్రారంభించింది. ఇప్పుడు దీనిపైనే మేధావులు సైతం దృష్టి పెట్టారు. ఇదంతా వ్యూహాత్మ‌కంగా సాగుతున్న‌దేనా ?  లేక యాదృచ్ఛికంగా.. ప్ర‌జ‌లే అనుకుంటున్నారా ? అనే విష‌యంపై చ‌ర్చ‌కు వ‌స్తోంది. ఎందుకంటే.. రాజ‌కీయాల్లో ఏదైనా చేయాల‌ని అనుకున్న‌ప్పుడు.. ఖ‌చ్చితంగా ముందు ఇలాంటి క‌థ‌నాలు రాయించ‌డం.. టీడీపీ నేత‌ల‌కు తెలిసిన విద్య‌గా వైసీపీ నాయ‌కులు చెబుతున్నారు.

ఈ క్ర‌మంలో జ‌న‌సేన‌తో మిత్రత్వం కోసం.. టీడీపీ ప‌డుతున్న ప్ర‌యాస నేప‌థ్యంలో ముందు ఇలా ప్లాన్ చేస్తున్నార‌ని.. నెమ్మ‌ది నెమ్మ‌దిగా ప్ర‌జ‌లు కోరుకుంటున్నారు క‌నుక‌.. అంటూ.. జ‌న‌సేన‌తో బంధానికి రెడీ అయ్యే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ఏదేమైనా.. దీని వెనుక టీడీపీ కీల‌క పెద్ద ఉన్నార‌ని మాత్రం ప్ర‌చారం సాగుతోంది. దీనిని ఖండించేవారు స‌మ‌ర్ధించే వారు లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: