సీనియ‌ర్లు వ‌ద్దు స‌ర్ జూనియ‌ర్లే ముద్దు. జ‌గ‌న్ ఏ నిర్ణ‌యం ఎలా తీసుకున్నా అధిష్టానం గీత దాట‌మ‌ని అంటున్నారు అమాత్యులు.ఏపీ క్యాబినెట్లో ఎన్న‌డూ లేని విధంగా మార్పులు వ‌స్తే ఆ మార్పుల‌కు అనుగుణంగా కొత్త వారికి అవ‌కాశం ఇస్తే ఎలా ఉంటుంది? ఆవేశం ఉన్న‌వారికి ఆలోచ‌న ఉన్న‌వారికి తోడుగా ఉండేలా తాను ఉంటాన‌ని సీఎం అంటున్నారు. విప‌క్షాల‌పై ఆవేశం, పథ‌కాల‌పై ఆచ‌ర‌ణ ఉండేవారికి తాను మంచి స్థానం ఇవ్వాల‌ని సీఎం జ‌గ‌న్ భావిస్తున్నారు అని తెలుస్తోంది. జిల్లాల‌లో ఇప్ప‌టికే కొంద‌రు ఆశావ‌హులు లైన్లు క‌డుతున్నారు. శ్రీ‌కాకుళంలో స్పీక‌ర్ త‌మ్మినేని తన ప్ర‌య‌త్నం చేసిన‌ప్ప‌టికీ ఫ‌లితం ఎలా ఉంటుంది అన్న‌ది ఇప్పుడొక స‌స్పెన్స్. 
సంక్రాంతి పండుగ కు కొత్త అల్లుళ్లు ఊసు వినిపించిన విధంగానే ఈ సారి కొత్త మంత్రుల రాక అన్న‌ది షురూ కానుంది. స‌రిగ్గా సంక్రాంతికే ఈ పున‌ర్వ్య‌స్థీక‌ర‌ణ ఉన్నా, లేకున్నా, కూర్పు మాత్రం ఆనాటికే షురూ కానుంది. ముఖ్యంగా జ‌గ‌న్ ఇలాకాలో కొత్త వారికి చోటు ఇచ్చి, పాత వారిని పూర్తిగా ఎమ్మెల్యే ప‌ద‌వులకే ప‌రిమితం చేయాల‌న్న ఆలోచ‌న ఉంది. ఈ విధంగా మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ ఉంటే బాగుంటుంది అన్న ప్ర‌తిపాద‌న ఒక‌టి వ‌చ్చింద‌ని జ‌గ‌న్ వ‌ర్గాలు చెబుతున్నాయి. దీంతో కొత్త మంత్రివ‌ర్గంలో జూనియ‌ర్లే సీనియ‌ర్ల స్థానంలో ఉండ‌నున్నారని, అందుకు త‌గ్గ ఏర్పాట్లు అవుతున్నాయ‌ని తెలుస్తోంది.
శ్రీ‌కాకుళం మొద‌లుకుని అనంత వ‌ర‌కూ కొత్త క్యాబినెట్ పై చ‌ర్చ ఉంది. ఇప్ప‌టికిప్పుడు ప‌దవి నుంచి త‌ప్పిస్తే తామేం అయిపోతాం అన్న బెంగ కొంద‌రిలో ఉంటే, ఎందుకు వ‌చ్చిన గొడ‌వ అస‌లు ప‌ద‌వే లేకుండా ఉంటే మేలు అన్న భావ‌న ఇంకొంద‌రి నుంచి వ‌స్తుంది. ప‌ద‌వి ఉన్నా, లేకున్నా తాము పార్టీకి సేవ‌లందిస్తామ‌ని బాలినేని లాంటి వారు చెబుతుండడంతో పాటు సంబంధిత నిర్ణ‌యాలు ఎలా ఉన్నా స‌మ్మ‌తిస్తామ‌ని మీడియా ఎదుట ఒప్పుకున్నారు కూడా!  

మరింత సమాచారం తెలుసుకోండి:

ap