పిలిచి ప‌ద‌వి ఇస్తే ఎగిరి గంతేసే రోజులు పోయాయి. ఆ విధంగా అనుకోవ‌డం, రాజ‌కీయం చేయ‌డం అన్న‌వి ఇప్పుడొక త‌ల‌నొప్పి వ్య‌వ‌హారాలు. ఆర్థికంగా ఏమీ లేని రాష్ట్రానికి మంత్రి అయినా, ఎమ్మెల్యేగా ఉండిపోయినా రెండూ ఒక్క‌టే కొంద‌రికి..ఎందుక‌ని?

ల‌క్ష కోట్ల డ‌బ్బులు ప్ర‌తి ఏటా సంక్షేమానికే వెచ్చిస్తున్న ఏకైక ప్ర‌భుత్వం వైసీపీనే ! అందుకే గ్రామాల్లో రోడ్ల ప‌నులు లేవు. పంట కాలువ‌ల మ‌ర‌మ్మ‌తులు లేవు. ఇంకా చెప్పాలంటే ప్రభుత్వం ఆస్తులు అయిన బడి, ఆస్ప‌త్రి వంటి ఇత‌ర నిర్మాణాల జోలికి అస్స‌లు పోవ‌డం లేదు. ఆద‌రాబాద‌రాగా ఆర్బీకే సెంట‌ర్ల ఏర్పాటు మాత్రం ఉన్నా అవి కూడా కొన్ని చోట్ల పూర్తిగా లేవు. స‌చివాల‌యాల నిర్మాణాలు కొన్నింటే చేప‌ట్టి వ‌దిలేశారు. దీంతో ఆర్బీకేలు, గ్రామ స‌చివాల‌యాలు అద్దె భ‌వ‌నాల్లోనే న‌డుస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో  కొత్త ప‌నులు ఏవీ లేని సంద‌ర్భంలో త‌మ‌కు అస్స‌లు మంత్రి ప‌ద‌వులే వ‌ద్ద‌ని, వాటి వ‌ల్ల ఉప‌యోగ‌మేమీ లేద‌ని తేల్చేస్తున్నారు సీనియ‌ర్ నాయ‌కులు. వీరితో పాటే కొంద‌రు జూనియ‌ర్లు కూడా!


ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వ హ‌యాంలో తీసుకుంటున్న నిర్ణ‌యాలు, వాటి అమ‌లు త‌రుచూ వివాదాల‌కు నెల‌వు కావ‌డంతో ఏం చేయాలో తోచ‌క సీనియ‌ర్లు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు. కొంద‌రైతే ప‌ద‌వులు వ‌ద్దే వ‌ద్ద‌ని అంటున్నారు. ఆర్థికంగా ఎందుకూ ప‌నికిరాని ప‌ద‌వు లు అస్స‌లు వ‌ద్ద‌ని కూడా అంటున్నారు. రాజ‌కీయ‌, సామాజిక ప‌రిణామాల్లో మార్పున‌కు తాము స‌హ‌క‌రించిన‌ప్ప‌టికీ త‌మ‌కు ఆర్థిక ల‌బ్ధి ఇప్ప‌టికీ లేద‌ని కొంద‌రు వైసీపీ మంత్రులు వాపోతున్నారు. త‌మ‌కు కానీ, త‌మ వారికి కానీ కాంట్రాక్టులు అస్స‌లు ద‌క్క‌డ‌మే లేద‌ని, డ‌బ్బుల‌న్నీ సంక్షేమానికి వెచ్చించిన‌ప్పుడు ఇక ప‌నుల‌కు నిధులు ఎలా తీసుకువ‌స్తార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. వైసీపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి రెండున్న‌రేళ్లు అయిన‌ప్ప‌టికీ ఇందాక ప‌నులు చేప‌ట్టిన‌వేవీ లేవ‌ని, ఈ విష‌య‌మై రాష్ట్రం వెనుక‌బ‌డిపోయింద‌ని మంత్రులు వాపోతున్నారు. కానీ జగ‌న్ నిబంధ‌న‌ల మేర‌కు తాము నోరు విప్ప‌లేక‌పోతున్నాయ‌ని అంత‌ర్మ‌థ‌నం చెందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap