స్వ‌రాష్ట్ర ఉద్యమాన్ని ప‌తాక స్థాయికి తీసుకుపోయిన పోరాటంలో మిలియ‌న్ మార్చ్ ఒక‌టి.. వేలాది మంది ప్ర‌జ‌లు, తెలంగాణ స్వ‌రాష్ట్రం ఆకాంక్షించిన అన్ని రాజ‌కీయపార్టీలు టీజేఏఎస్ పిలుపుతో 2011 మార్చ్ 10 న మిలియ‌న్ మార్ఛ్ ను చేపట్టారు. ఇప్పుడు రాజ‌కీయ ఉద్య‌మంలో భాగంగా మ‌రో మిలియ‌న్ మార్చ్ నిర్వ‌హిస్తామ‌ని బీజేపీ ప్ర‌క‌ట‌న చేసింది. దీపావళి లోపు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు విడుద‌ల చేయ‌కుంటే హైదరాబాద్లో నిరుద్యోగులతో మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెల్ల‌డించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి డెడ్లైన్ ఇచ్చారు బండి. టీఆర్ఎస్ ప్ర‌త్వంపై ఆఖరి పోరాటానికి బీజేపీ సిద్ధమైందని నిరుద్యోగులు ఎవరూ ఆత్మహత్యల‌కు పాల్ప‌డ‌వ‌ద్ద‌ని బండి సంజ‌య్ కోరారు.


  రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ విషయంలో టీఆర్ ఎస్ ప్రభుత్వానికి  డెడ్లైన్ గీశారు బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షులు బండి సంజ‌య్‌. దీపావళి నాటికి ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటికీ నోటిఫికేషన్లు ప్ర‌క‌టించాల‌ని లేక‌పోతే నిరుద్యోగుల‌తో హైద‌రాబాద్‌లో మిలియ‌న్ మార్చ్ చేపడుతామ‌ని స్ప‌ష్టం చేశారు సంజ‌య్.  లేకుంటే నిరుద్యోగులతో హైదరాబాద్లో మిలియన్ మార్చి నిర్వహిస్తామని, ఈ మిలియ‌న్ మార్చ్ తో టీఆర్ఎస్ ప్ర‌భుత్వం కూలిపోవడం ఖాయ‌మ‌ని జ్యోష్యం చెప్పారు.


     తెలంగాణలో మార్పు కోసం చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర.. మహాసంగ్రామ యాత్రగా మారిందని బండి సంజయ్ తెలిపారు. ప్రజాసంగ్రామయాత్ర పేరుతో చేస్తున్న పాద‌యాత్ర‌లో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలో అంకిరెడ్డిపల్లెలో జరిగిన బహిరంగ సభలో బండి సంజ‌య్ ప్ర‌సంగించారు. ప్ర‌పంచమంతా మోడీ.. మోడీ అంటే.. దేశ‌మంతా యోగి..యోగి అంటున్నార‌ని, తెలంగాణ‌లో మాత్రం రోగి రోగి అని అంటున్నార‌ని ఎద్దేవా చేశారు బండి సంజ‌య్‌.


   'ఇంటికో ఉద్యోగం ఏమైంది? డీఎస్సీ ఏమైంది?  అని ప్ర‌శ్నించారు. విద్యా వలంటీర్లను తొలగించారు, 7 వేల మంది ఫీల్డ్ అసిస్టెంట్లను తీసేశార‌ని బండి పేర్కొన్నారు. విద్యావ్యవస్థను టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం చిన్నాభిన్నం చేస్తోంద‌ని ఆరోపించారు. రైతుబంధు ఇచ్చి మిగిలిన అన్ని సబ్సిడీలు బంద్ చేశార‌న్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: