కొత్త క్యాబినెట్ కూర్పుల‌పై జిల్లాలోనూ చ‌ర్చ‌లు అవుతున్నాయి. జ‌గ‌న్ ఎవ్వ‌రి మాటా విన‌రు క‌నుక పాత స్నేహితుల‌ను, వైఎస్ స‌న్నిహితుల‌ను చాలా దూరంగా ఉంచుతున్నార‌న్న అప‌వాదు పోయేలా ఈ సారి ధ‌ర్మాన‌కు క్యాబినెట్ బెర్తు ఇవ్వాల‌ని భావిస్తున్నారు. నింద‌ను తొల‌గించుకునే క్ర‌మంలో  భాగంగానే ఆయ‌న ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని తెలుస్తోంది. అదేవిధంగా ఆయ‌న సేవ‌ల‌ను రాఉన్న ఎన్నిక‌ల సమ‌యంలో వినియోగించుకోవాల‌ని కూడా భావిస్తున్నారు. కొత్త క్యాబినెట్ తోనే ఆయ‌న ఎన్నిక‌లకు పోనున్నారు క‌నుక స‌మ‌ర్థులైన నాయ‌కుల‌ను త‌న ఖాతాలో ఉంచుకోవాల‌ని ఆలోచిస్తున్నారు. అంతేకాకుండా అసెంబ్లీలో పార్టీ వాయిస్  బ‌లంగా వినిపించే ధ‌ర్మాన లాంటి వారు, క్యాబినెట్లో ఉంటే ఇంకా మంచి జ‌రుగుతుంద‌ని ఆయన యోచిస్తున్నారు. ఈ త‌రుణంలో ధ‌ర్మాన ప్రయాణం ఎటువైపు?

మ‌రోవైపు స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం మాత్రం త‌న‌కు ఆ ప‌ద‌వి వ‌ద్ద‌నే అంటున్నారు. డిప్యూటీ స్పీక‌ర్ కోన ర‌ఘుప‌తిని స్పీక‌ర్ ను చేసి త‌న‌ను మంత్రి వ‌ర్గంలో తీసుకోవాల‌ని కోరుతున్నారు. కానీ ఆయ‌న కోరిక వినేలా లేరు జగ‌న్. అదేవిధంగా గ్రౌండ్ రిపోర్టులో స్పీక‌ర్ త‌మ్మినేని వివాదాలు కొన్ని ప్ర‌స్తావ‌న‌లో ఉన్నాయి. ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌కూడ‌ద‌న్న ఆలోచ‌నే ఆఖ‌రికి అమ‌లు అయ్యేలా ఉంది అని తెలుస్తోంది. ఈ సారి కూర్పులో శ్రీ‌కాకుళం నుంచి కాళింగ, వెల‌మ కాకుండా కాపు సామాజిక‌వ‌ర్గంను తీసుకోవాల‌న్న ఆలోచ‌న కూడా ఉంద‌ని స‌మాచారం. ధ‌ర్మాన కాకుండా ఆయ‌న స్థానంలో రెడ్డి శాంతికి ఓ అవ‌కాశం ఇవ్వాల‌న్న ప్ర‌తిపాద‌న ఒక‌టి తెర‌పైకి వ‌చ్చింది. పాత‌ప‌ట్నం ఎమ్మెల్యే గా ఉన్న ఆమె, ఇప్ప‌టికే పార్టీ కోసం ఎంతో ప‌నిచేశారు. ఆమెకు మంత్రిగా అవ‌కాశం ఇస్తే జిల్లాలో స‌గం నియోజ‌క‌వ‌ర్గాల‌పై మంచి  ప‌ట్టు వ‌స్తుంద‌ని భావిస్తున్నారు. స్పీక‌ర్ ను స్పీక‌ర్ గానే ఉంచి, మంత్రి ప‌ద‌వి ధర్మాన‌కు కాకుండా రెడ్డి శాంతికి ఇవ్వ‌వ‌చ్చు అని కూడా కొంద‌రి ప్ర‌తిపాద‌న. ఏం జ‌రుగుతుందో?మరింత సమాచారం తెలుసుకోండి:

ap