చిత్తూరు రాజ‌కీయాల్లో రాజ్యాధికార పోక‌డ‌లు సొంతం చేసుకోవ‌డం కోసం  సినీ న‌టి, న‌గ‌రి ఎమ్మెల్యే రోజా సెల్వ‌మ‌ణి అనేక అవ‌స్థ‌లు ప‌డుతున్నారు. అప్ప‌ట్లో జ‌గ‌న్ మ‌ద్ద‌తు ఇచ్చిన విధంగా ఇవాళ ఆమెకు అధిష్టానం మ‌ద్ద‌తు లేదు.పైగా సీనియ‌ర్ లీడ‌ర్ పెద్దిరెడ్డిని ఎంత మాత్రం కాద‌నుకునే సీన్ లో లేరు జ‌గ‌న్. ప్ర‌తిప‌క్ష హోదాలో ఉన్నప్పుడు పార్టీకి అండ‌గా ఉన్న రోజా, అధికారం ద‌క్కాక ఎటూ వెళ్ల‌లేని స‌మ‌స్య‌ల జ‌డిలో చిక్కుకుపోతున్నారు. స్వీయ త‌ప్పిదాల కార‌ణంగానే ఈ రోజు ఇలాంటి స్థితిని ఎదుర్కొంటున్నార‌ని ప‌రిశీల‌కులు అంటున్నారు. అదేవిధంగా జ‌బ‌ర్ద‌స్త్ లాంటి షో నుంచి బ‌య‌ట‌కు రావ‌డం కూడా ఆమెకు ఉత్త‌మం అని మ‌రోసారి స‌ల‌హా ఇస్తున్నారు. ఇవి విన్న రోజా త‌న ఆర్థిక ప‌రిస్థితులు బాగాలేని కార‌ణంగానే ఈ షోను కంటిన్యూ చేస్తున్నాన‌ని క‌న్నీళ్లు పెడుతూ స‌మాధానం ఇస్తున్నారు. రోజా ఇంత‌గా ఎమోష‌న‌ల్ గా మాట్లాడినా పై స్థాయి వ్య‌క్తులు ఆమెకు  
పెద్దగా ఓదార్పు ఇవ్వ‌డం లేదు.


సినీ న‌టి రోజా మ‌ళ్లీ గొడ‌వ‌ల్లో ఇరుక్కుకున్నారు. పార్టీలో ఆమె ఇదివ‌ర‌కు క‌న్నా యాక్టివ్ అయిన‌ప్ప‌టికీ అనుకున్న ఫ‌లితాలు అందుకున్న‌ప్ప‌టికీ అస‌మ్మ‌తి స్వరాల‌ను నియంత్రించ‌లేక‌పోతున్నారు. చిత్తూరు జిల్లాలో త‌న ప్ర‌త్య‌ర్థి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి మ‌నుషుల‌ను ఢీ కొన లేక‌పోతున్నారు. తరుచూ వివాదాల్లో ఇరుక్కుపోయి, క‌న్నీళ్లు పెట్టుకోవ‌డం మిన‌హా సాధించిందేమీ లేదు అని కూడా తెలుస్తోంది. స్థానిక పోరు కూడా ఇలానే సాగింద‌ని తెలుస్తోంది.  
త‌న మాట నెగ్గించుకున్న దాఖ‌లాలు ఉన్న‌ప్ప‌టికీ పెద్దిరెడ్డి హవా ముందు అవి వెల‌వెల‌బోయాయి. కొన్ని చోట్ల ఆమె వెన‌క్కు త‌గ్గేందుకు సైతం చేసేలా  పెద్ది రెడ్డి అనుచ‌రులు వ్యూహాలు ప‌న్నారు. తాజాగా  ఎంపీపీ ఎన్నిక‌ల పోరు కూడా ఇలానే సాగింది. నిండ్ర మండ‌ల ఎంపీపీ వివాదం చాలా తీవ్ర‌త‌ల మ‌ధ్య వాయిదాపడింది. పెద్ది రెడ్డి మ‌నుషులు తమ మాటే నెగ్గాల‌ని ప‌ట్టుబ‌ట్ట‌డంతో ఇరు వ‌ర్గాలూ కొట్టుకునేదాకా వెళ్లేయ‌ని స‌మాచారం.దీంతో ఎన్నిక వాయిదా ప‌డినా, స‌మ‌స్యకు రోజా చెబుతున్న ప‌రిష్కారం వ‌ర్కౌట్ కావ‌డం లేదు. గ్రామాల్లో త‌న ప‌రువును నిలుపుకునే ప‌నుల‌కు ప్రాధాన్యం ఇస్తూ త‌రుచూ  ప‌డుతున్న గొడ‌వ‌ల‌ను పెంచుకుంటూ పోతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

ap