ఏపీలో గ‌త ఎన్నిక‌ల‌లో వైసీపీ అధికారంలోకి వ‌చ్చాక టీడీపీకి చెందిన ప‌లువురు కీల‌క నేత‌లు పార్టీ మారిపోయారు. ఈ లిస్టులోనే టీడీపీ నుంచి గెలిచిన న‌లుగురు ఎమ్మెల్యేలు సైతం ఉన్నారు. వీరిలో క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన చీరాల ఎమ్మెల్యే క‌ర‌ణం బ‌ల‌రాం కూడా ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల‌కు ముందే అద్దంకి నుంచి షిప్ట్ అయిన క‌ర‌ణం చీరాల‌లో వైసీపీ గాలి ఎదుర్కొని కూడా అనూహ్యంగా గెలిచారు. ఆ త‌ర్వాత కొద్ది రోజుల‌కే ఆయ‌న త‌న కుమారుడు క‌ర‌ణం వెంక‌టేష్ రాజ‌కీయ భ‌విష్య‌త్తు కోస‌మే వైసీపీ చెంత చేరిపోయారు. అయితే ఇప్పుడు ఆయ‌న‌కు , ఆయ‌న వార‌సుడికి జ‌గ‌న్  రాజకీయంగా తిరిగి కోలుకోలేనంతగా షాక్‌ ఇవ్వబోతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

క‌ర‌ణం ఎక్క‌డ ఉన్నా వివాదాలు ఆయ‌న వెంటే ఉంటున్నాయి. ఇంకా చెప్పాలంటే ఆయ‌న దూకుడు త‌నంతోనే ఆయ‌న గ‌తంలో టీడీపీలో ఉన్న‌ప్పుడు.. ఇప్పుడు వైసీపీలో ఉన్న‌ప్పుడు వివాదాల‌తోనే సావాసం చేస్తున్నారు. అయితే ఇప్పుడు చీరాల‌లోనూ ఇదే తంతు న‌డుస్తోంది. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఎంత మోనార్కో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఆయ‌న కొమ్ములు తిరిగిన సీనియ‌ర్ల‌నే సింపుల్‌గా చిన్న బ్రేక్ వేసేసి కంట్రోల్ చేస్తున్నారు. క‌ర‌ణంను కంట్రోల్ చేయ‌డం ఆయ‌న‌కు పెద్ద లెక్క కాదు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు జ‌గ‌న్ వేస్తోన్న ఎత్తులో కరణం అనుకోని విధంగా ఎదురు దెబ్బతినే అవకాశాలున్నాయని అధికార పార్టీ నేతలే తెర వెనుక అంటున్నారు.

అసలు విషయానికి వస్తే.. చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కే నియోజకవర్గ పార్టీ ఇంఛార్జిగా దాదాపుగా నియమించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. క‌ర‌ణంను ప‌ర్చూరు నియోజవర్గ ఇంచార్జిగా నియమించి ఆమంచిని చీరాల ఇంఛార్జిగా నియమించటమే కాకుండా.. భవిష్యత్తులో ఆయనే పోటీ చేస్తారనే సూచనలను కరణంకు ఇవ్వబోతున్నార‌ని పార్టీలో కీల‌క నేత‌ల మ‌ధ్య చ‌ర్చ జ‌రుగుతోంది. కొద్ది రోజుల క్రిత‌మే చీరాల గొడవ ప‌రిష్క‌రించేందుకు జ‌గ‌న్ పర్చూరు నియోజకవర్గ ఇంఛార్జిగా మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ను నియమించి ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ఇవ్వాల‌ని అనుకున్నారు. అందుకు ఆమంచి ఒప్పుకోలేదు. దీంతో ఇది బ్రేక్ ప‌డింది.

అయితే చీరాల‌లోనే ఆమంచికి పార్టీల‌తో సంబంధం లేకుండా వ్య‌క్తిగ‌త కేడ‌ర్ ఉంది. ఆయ‌న అక్క‌డ నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెల‌వ‌డంతో పాటు ఓ సారి ఇండిపెండెంట్‌గా కూడా గెలిచారు. దీంతో తెగేదాక గొడ‌వ‌ను లాగి పార్టీని అక్క‌డ న‌ష్ట‌ప‌ర‌చ‌డం కంటే ప‌ర్చూరు ప‌గ్గాలు క‌ర‌ణంకు అప్ప‌గించి ఈ వివాదానికి ఇక్క‌డితో చెక్ పెట్టాల‌ని జ‌గ‌న్ డిసైడ్ అయ్యార‌ని తెలుస్తోంది. ఈ మేర‌కు క‌ర‌ణంకు కొద్ది రోజులుగా పార్టీ అధిష్టానం నుంచి సంకేతాలు కూడా వ‌స్తున్నాయంటున్నారు. ఎలాగూ ప‌ర్చూరులో వైసీపీకి గ‌ట్టి లీడ‌ర్ లేరు.

ఈ క్ర‌మంలోనే క‌ర‌ణంను అక్క‌డ‌కు పంపాల‌ని అధిష్టానం భావిస్తోంది. ఇటు చీరాల‌లో క‌ర‌ణం స‌మీక‌ర‌ణ‌ల‌ను బ‌ట్టి గెలిచారే త‌ప్పా అక్క‌డ ఆయ‌నకు ఏ మాత్రం పట్టులేదు. ఈ లెక్క‌ల‌న్నీ బేరీజు వేసుకునే క‌ర‌ణంను చీరాల నుంచి సాగ‌నంప‌నున్నార‌ని.. అందుకే ఒక‌టి రెండు నెల‌లై టైం ఉంద‌ని తెలుస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: