జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు వివాదా స్పదంగా మారాయి. ఆయ‌న మేన‌ళ్లుడు సాయిధ‌ర‌మ్ తేజ్ యాక్సిడెంట్‌కు గుర‌వ్వ‌డంతో ఆయ‌న న‌టించిన రిప‌బ్లిక్ సినిమా ఫంక్ష‌న్‌కు ప‌వ‌న్ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యారు. ఈ క్ర‌మంలోనే ప‌వ‌న్ మాట్లాడుతూ త‌న‌ను ఇబ్బంది పెట్టాల‌న్న క‌క్ష‌తో ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్‌. జ‌గ‌న్ మొత్తం టాలీవుడ్‌కే ఇబ్బందులు క్రియేట్ చేస్తున్నార‌ని అన్నారు. అయితే ప‌వ‌న్ చేసిన ఈ వ్యాఖ్య‌ల‌పై ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. ప‌వ‌న్ తెర ముందు మాత్ర‌మే కాదు.. తెర వెనుక కూడా అద్భుత న‌ట‌న ప్ర‌ద‌ర్శిస్తున్నార‌నే విమ‌ర్శ‌లొస్తున్నాయి.

అస‌లు ఈ ఫంక్ష‌న్లో ప‌వ‌న్ రాజ‌కీయాల గురించి మాట్లాడాల్సిన అవ‌స‌రం కూడా లేదు. కానీ ప‌వ‌న్ మాత్రం కావాల‌నే కెలుక్కున్న‌ట్టు అర్థ‌మ‌వుతోంది. పైగా ఇక్క‌డ కులాల ప్ర‌స్తావ‌న కూడా ప‌వ‌న్ తీసుకు రావ‌డం మ‌రీ విడ్డూరం. తాను న‌టించిన వకీల్‌సాబ్‌దిల్‌రాజు నాతో ఎందుకు చేశారో ? ఆయ‌న ఆ సినిమా నాతో ఆ సినిమా తీయకపోతే ఈపాటికే ఆంధ్రప్రదేశ్‌లో సినిమాలు విడుదలై ఉండేవని ప‌వ‌న్ అన్నారు. పైగా దిల్ రాజు - జ‌గ‌న్ ఇద్ద‌రూ రెడ్లే.. జ‌గ‌న్‌కు రెడ్లు అంటే బాగా ఇది ఉంది.. మీరు మీరు చూసుకోండంటూ కాస్త సెటైర్ ధోర‌ణితో మాట్లాడారు.

ఏపీలో సినిమాల‌కు ఇబ్బందులు క‌లిగిస్తే అంద‌రూ కూడా భ‌య‌ప‌డి పోయి త‌న ద‌గ్గ‌ర‌కు వ‌స్తార‌న్న ఆలోచ‌న‌తో వైసీపీ నాయ‌కులు, ఆ ప్ర భుత్వం ఉంద‌ని.. చిత్ర ప‌రిశ్ర‌మ వైపు క‌న్నెత్తి చూసినా చాలు కాలిపోతారు జాగ్రత్త అంటూ పవన్‌ హెచ్చరించారు. ఇక ఇక్క‌డ ప‌వ‌న్ క‌ళ్యాణ్ టాలీవుడ్ అంటే కేవ‌లం తాను, త‌న కుటుంబ మాత్ర‌మే అనే భ్ర‌మల్లో ఉన్నారా ? త‌న కుటుంబానికే ఏదో అన్యాయం జ‌రిగి పోతోంది ? అన్న భావ‌న‌ల్లో ఉండి పోయార‌ని కూడా కొంద‌రు విమ‌ర్శిస్తున్నారు.

ఇక రెడ్ల‌ను టార్గెట్ చేస్తూ మాట్లాడ‌డంతో ఆ వ‌ర్గం వాళ్లు ప‌వ‌న్‌ను సోష‌ల్ మీడియాలో టార్గెట్ చేసుకుని విరుచు కు ప‌డుతున్నారు. ప‌వ‌న్‌ ఇలాంటి అర్థంప‌ర్థం లేని మాట‌ల‌ను ఎందుకు ?  మాట్లాడార‌ని వాళ్లు మండి ప‌డుతున్నారు. ఇలా అయితే ప‌వ‌న్ రెడ్ల‌కు పూర్తిగా దూరం అవ్వాల్సిందే..!

మరింత సమాచారం తెలుసుకోండి: