జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌.. ఒక్క‌మాట అని.. వంద మాట‌లు అనిపించుకున్నారా? అంటే.. ఔన‌నే అంటు న్నారు విశ్లేష‌కులు. శ‌నివారం రాత్రి రిపబ్లిక్ మూవీ ప్రి-రిలీజ్ ఫంక్షన్‌లో మాట్లాడిన ప‌వ‌న్‌.. వైసీపీ ప్రభు త్వంపైనా.. ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌పైనా.. ఇత‌ర‌ నాయకులపై నిప్పులు చెరిగారు. అయితే.. ఈ వ్యాఖ్య‌ల‌ను సీరియ‌స్‌గా తీసుకున్న వైసీపీ స‌ర్కారు మంత్రులు. ప‌వ‌న్‌పై విరుచుకుప‌డ్డారు. మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్‌.. తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేయ‌గా.. తాజాగా మ‌రో మంత్రి.. విజ‌య‌వాడ‌కు చెందిన నాయ‌కుడు వెలంప‌ల్లి శ్రీనివాస్ మ‌రింత హాట్ కామెంట్లు చేశారు.

సీఎం జగన్‌ గురించి మాట్లాడితే ప‌వ‌న్‌కే తాటతీస్తామని మంత్రి వెలంప‌ల్లి హెచ్చరించారు. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్‌ ఓ పనికిమాలిన స్టార్‌ అని ఘాటుగా విమర్శించారు. పవన్ గురించి ఆలోచించాల్సిన అవస రం లేదని, అతను  రెండు చోట్ల పోటీచేసి  ఒక్క‌చోట కూడా గెలుపు గుర్రం ఎక్క‌లేక పోయార‌ని అన్నారు. పంచాయతీ, మున్సిపల్, పరిషత్ ఎన్నికల్లో కూడా జనసేన దారుణంగా ఓడిపోయిందని విమర్శించారు. చిరంజీవి, నాగార్జున వంటి అగ్ర‌హీరోలు..  సినిమా థియేటర్లు, టికెట్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రపోజల్ పెట్టారని తెలిపారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వం, ఇండస్ట్రీ మధ్య చర్చలు జరుగుతున్నా యని మంత్రి వెల్లడించారు.

అంతేకాదు.. ‘మా’ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని పవన్ మాట్లాడుతున్నట్లు ఉందని వెల్లంపల్లి అభిప్రాయపడ్డారు.  పవన్ మీద తమకు కక్ష ఎందుకుంటుందని ప్రశ్నించారు. ఆయన తాట ఆయనే తీసుకున్నాడని.. సినిమా ప్రోగ్రాంలో రాజకీయాలు ఎందుకు మాట్లాడార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పావలా పవన్ కళ్యాణ్ వ‌ల్ల‌... ఏమవుతుందని మంత్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ ఫామ్ హౌస్ లో కూర్చోవాలని.. జగన్ గురించి మాట్లాడితే తాట తీస్తామని హెచ్చిరించారు. పవన్ కళ్యాణ్ అమ్ముడు పోయే వ్యక్తి అని అన్నారు. ఎవరు డబ్బులు ఇస్తే వారికి ప్రచారం చేస్తాడంటూ నిప్పులు చెరిగారు.

రాష్ట్రంలో పాల‌న ఎలా ఉందో.. ప‌వ‌న్ త‌మ‌కు చెప్పాల్సిన అవ‌స‌రం లేద‌న్న వెలంప‌ల్లి.. ప‌రిష‌త్ ఎన్నిక ల్లో రెండు ఎంపీటీసీలు గెలుచుకుంటే.. అధికారంలోకి వ‌చ్చేసిన‌ట్టా? అని ప‌వ‌న్‌ను ప్ర‌శ్నించారు. ఎక్క‌డై నా.. ప‌వ‌న్ ఒంట‌రిగా పోటీ చేసి గెలిచే స‌త్తా ఉందా? అని స‌వాల్ చేశారు. ఏదైనా ఉంటే.. ఇండ‌స్ట్రీ పెద్ద‌ల‌తో చ‌ర్చించుకుంటే.. ప‌వ‌న్‌కు గౌర‌వం ఉంటుంద‌ని హిత‌వు ప‌లికారు. అన‌వ‌స‌రంగా జ‌గ‌న్‌పై నోరు పారేసుకుంటే.. ఆయ‌న ఇమేజే పోతుంద‌ని అన్నారు. త‌న సినిమాలు ఆపాల్సిన అవ‌స‌రం ఏపీ ప్ర‌భుత్వానికి లేద‌ని చెప్పారు. అయినా.. సినిమా ఫంక్ష‌న్‌ను రాజకీయ ఫంక్ష‌న్ చేయ‌డం ఆయ‌న విజ్ఞ‌త‌కే వ‌దిలేస్తున్నామ‌ని.. ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: