మనిషిలో సంకల్పశక్తి అన్ని సాధించి పెడుతుంది. అందుకే ఏమి లేని వాడు ఉన్నత స్థితికి వెళ్లగలుగుతున్నాడు. ఏదో లేదే అని లోపం చూసే వారి కంటే నాకేంటి అనే వారికి లక్ష్యం సాధించడంలో సంకల్పం బాగా పనికి వస్తుంది. అందుకే వాళ్ళు సాధించే విజయాలు గొప్పగా ఉంటాయి. బాగా చదివి ఒక ఉద్యోగం సాధించడమే కొందరికి పెద్ద లక్ష్యం, దేశాన్ని అభివృద్ధి చేసుకోవాలనేది ఒకరి లక్ష్యం అయితే వీటిలో ఏది పెద్దది, ఏది సాధిస్తే సంకల్పం గొప్పగా ఉపయోగపడినట్టు అనేది ఆయా వ్యక్తులను బట్టి ఉంటుంది. భారత ప్రధాని మోడీ ఇటీవల మన్ కి బాత్ లో సియాచిన్ లో జాతీయ జండా ఎగురవేసిన దివ్యంగుల ను ప్రశంసించారు.

సియాచిన్ లో సామాన్య మానవులు జీవించడానికి అనుకూలంగా ఉండదని మోడీ చెప్పారు. ఆ ప్రాంతంలో 15వేల అడుగుల ఎత్తులో దివ్యంగులు జాతీయజండా ఎగురవేయడం దేశానికే స్ఫూర్తినిచ్చే అంశమని ఆయన కొనియాడారు. ఎన్నివేల అడుగుల ఎత్తులో వాళ్ళు చేసిన సాహసానికి ప్రపంచ రికార్డు గా నమోదు చేశారు.  సామాన్యులే జీవించడానికి సాధ్యం కానీ ప్రాంతానికి ఎనిమిది మంది దివ్యంగుల బృందం వెళ్లడం దేశానికీ ప్రేరణ ఇచ్చే అంశమని ఆయన అన్నారు. వీరు చేసిన సాహసకృత్యం ప్రతీ భారతీయుడికి గర్వకారణం అన్నారు.

ఈ సాహసం గురుంచి తెలుసుకున్నప్పుడు తనకు కలిగిన ఉత్తేజం, ధైర్యం వారి గురించి తెలుసుకునే అందరికి కలుగుతాయని మోడీ తెలిపారు. ఈ బృందంలో ఉత్తరాఖండ్ కు చెందిన మహేష్ నెహ్రా, అక్షత్ రావత్, మహారాష్ట్ర కు చెందిన పుష్పక్ గుహాండే, హర్యానాకు చెందిన అజయ్ కుమార్, లడక్ కు చెందిన లోబ్సంగ్ చొస్పెల్, తమిళనాడు కు చెందిన మేజర్ ద్వారకేష్, జమ్మూ  కాశ్మీర్ కు చెందిన ఇర్ఫాన్ అహ్మద్ మీర్, హిమాచల్ ప్రదేశ్ కు చెందిన చొంగ్ జింగ్ ఇంగ్మో ఉన్నారు. వీరి సాహసం ఈ సమయంలో ఎందరికో నూతన ఉత్తేజాన్ని ఇస్తుందని మోడీ అన్నారు. సరైన సమయానికి ఉత్సాహం పొందటం  చాలా అవసరం, అది ఇచ్చిన వారికి కృతఙ్ఞతలు తెలపాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: