డ్రగ్స్ పుట్టలోనుంచి వైసీపీ విషసర్పాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి అన్నారు టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి. హూ ఈజ్ డ్రగ్ డాన్ ఇన్ ఏపీ అనే హ్యాష్ ట్యాగ్ జాతీయ స్థాయిలో నేడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం నిజంగా ఏపీప్రజలకు సిగ్గుచేటు అన్నారు ఆయన. జగ్యయ్యపేట వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను రెండో కుమారుడు ప్రశాంత్ డ్రగ్స్ వ్యవహారంలో మునిగితేలుతున్నాడు అంటూ ఆయన కామెంట్స్ చేసారు. ప్రశాంత్ నిన్నటికి నిన్న తెలంగాణ సరిహద్దులో తన మిత్రబృందంతో కలిసి,60 కిలోల గంజాయితో పట్టుబడ్డాడు అని అన్నారు ఆయన.

ఈ విషయం నేడు ప్రముఖ దినపత్రికల్లో పతాక శీర్షికల్లో వచ్చింది అని పేర్కొన్న ఆయన... ప్రశాంత్ పట్టుబడగానే తాడేపల్లి ప్యాలెస్, హైదరాబాద్ ప్రగతి భవన్ మంతనాలు నడపడంతో, ప్రశాంత్ ను తప్పించి ఇతరులను తెరపైకి తెచ్చారు అని ఆయన సంచలన ఆరోపన్నలు చేసారు. గుమ్మడి కాయల దొంగెవరంటే భుజాలు తడుముకున్నట్లు, డ్రగ్స్ దందా, మాదకద్రవ్యాలపై ప్రశ్నిస్తున్న టీడీపీ వారిపై ఉదయభాను నోరుపారేసుకున్నాడు అని ఆయన విమర్శించారు. ఆయన గురించి ఆయనకుటుంబం గురించి జగయ్యపేట నియోజకవర్గ వాసులకు బాగా తెలుసు అని ఆయన వ్యాఖ్యలు చేసారు.

ఇక వైసీపీ ఎమ్మెల్యే ఉదయభాను భూకబ్జాల్లో మునిగితేలుతున్నాడు అని ఇప్పుడు ఆయన రెండో కుమారుడు ప్రశాంత్ గంజాయితో తెలంగాణ పోలీసులకు పట్టుబడ్డాడు అని వ్యాఖ్యలు చేసారు. ఈ విధంగా ఉదయభానుతో సహా, ఆయన కుటుంబమంతా అక్రమాలు, నేరాల్లో మునిగి తేలుతోంది అంటూ విమర్శలు చేసారు. నిజంగా ప్రశాంత్ కు డ్రగ్స్ తో సంబంధంలేకపోతే, అతన్ని హైదరాబాద్ లోని ఫోరెన్సిక్ ల్యాబ్ కు తీసుకొచ్చి, ఉదయభానే  స్వయంగా రక్త, వెంట్రుకల నమూనాలు ఇప్పించాలి అని డిమాండ్ చేసారు. అక్కడ పరీక్షల్లో ప్రశాంత్ సచ్ఛీలుడని తేలితే, అప్ప్పుడు ఉదయభాను చెప్పినట్లుగా ఆయనకు, ఆయనకుటుంబానికి డ్రగ్స్ దందాతో ప్రమేయంలేదని నమ్ముతాం అని అన్నారు.

ఉదయభాను కుమారుడు ప్రశాంత్ తోపాటు, నేను కూడా నమూనాలు ఇవ్వడానికి సిద్ధం అని ఆయన సవాల్ చేసారు.  సవాల్ స్వీకరించే దమ్ము ఉదయభానుకు ఉందా?  అని నిలదీశారు. నాతోపాటు, టీడీపీ యువనేతలంతా కూడా డ్రగ్స్ పరీక్షలకు సిద్ధం అని సవాల్ చేసారు. తమతోపాటు వైసీపీ డ్రగ్స్ ముఠా కూడా అందుకు సిద్ధమా? అని నిలదీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: