అన‌వ‌స‌ర ద్వేషంతో ఆంధ్ర‌జ్యోతి ఆర్కే సాధించేది ఏమీ ఉండదు? కానీ వైఎస్ కుటుంబంపై లేనిపోనీ ప్రేమ ఎందుకు చూపుతాడు?

విచిత్రంలో విచిత్రం ఏబీఎన్ ఆర్కే కు ష‌ర్మిల ఇంట‌ర్వ్యూ ఇవ్వ‌డం. ఇప్పుడీ వివాదంలో జ‌గ‌న్ కూడా ఇరుక్కున్నారు. ఆయ‌న్ను టార్గెట్  చేస్తూ కొన్ని విష‌యాలు చెప్పారు ష‌ర్మిల.. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే అంటూ ప్ర‌తి ఆదివారం రాత్రి ఎనిమిద‌న్న‌రకు ప్ర‌సారం అయ్యే ఎపిసోడ్ కు సంబంధించి ఒక ప్రోమో వ‌దిలాడు ఆర్కే. ఇందులోనే కొన్ని ఆస‌క్తిదాయ‌క విష‌యాలు లీక్ చేశాడు. ఇవ‌న్నీ కార్య‌క్ర‌మంపై అంచ‌నాలు పెంచేశాయి. ఈ ఇంట‌ర్వ్యూలో ఇంటి గుట్టు లాగేందుకు చాలా ప్ర‌య‌త్నించాడు ఆర్కే. వాటిపై ఆమె ఏమ‌న్నారు అన్న‌ది ఇంట‌ర్వ్యూ ప్ర‌సారం అయ్యాకే తేలాలి. ఏదేమైన‌ప్ప‌టికీ ఇంటి త‌గాదాల నేప‌థ్యంలో త‌న‌వైపు ష‌ర్మిల‌ను తిప్పుకోవాల‌ని ఆర్కే చేసిన ప‌ని కాస్త విజ‌య‌వంతంగానే పూర్త‌యింది. ష‌ర్మిల లైవ్ క‌వ‌రేజీలు చూస్తూ, అదేవిధంగా ఆమెను ఫోక‌స్ చేస్తున్న ఆర్కే ఏం సాధిస్తాడు? ఇవ‌న్నీ చేశాక‌! అన్న‌ది లోగుట్టు. ఇది కాస్తా ఆ పెరుమాళ్ల‌కే ఎరుక‌!జ‌గ‌న్ కూ, ష‌ర్మిల‌కూ మ‌ధ్య వివాదాలు ఏం ఉన్నాయ‌న్న ధోర‌ణిలో గ‌త కొంత కాలంగా చ‌ర్చ‌న‌డుస్తోంది. నాన్నకు త‌నంటేనే ఇష్ట‌మ‌ని, ఆయ‌న ఆలోచ‌న‌కు అనుగుణంగా పాల‌న లేనందుకే తెలంగాణ‌లో పార్టీ పెట్టానని చెబుతున్నారు. ఇదంతా కేవ‌లం రాజ‌కీయ డ్రామా అని తేల్చేశారు ఇంకొంద‌రు. తాను ఎవ్వ‌రి మ‌నిషినీ కాద‌ని కూడా చెప్పారు. ఇదంతా బాగుంది. త‌న‌పై వ్ర‌తాలు చేసుకోమ‌ని అన్నందుకే హూ ఈజ్ కేటీఆర్  అని ప్ర‌శ్నించాన‌ని, త‌న‌కు కేటీఆర్ ఎవ‌రో తెలుసున‌ని, కోపంతోనే అలా అన్నాన‌ని అన్నారు.


 

నేను జగ‌న్ బాణాన్ని అన్న అన్నారు. ఇప్పుడు ప్ర‌జ‌ల బాణం అంటున్నారు ష‌ర్మిల. తెలంగాణ రాజ‌కీయాల్లో యాక్టివ్ అయ్యేం దుకు ప్ర‌యత్నిస్తున్న ష‌ర్మిల ఇటీవ‌ల ఓ మీడియా ఇంట‌ర్వ్యూకు వ‌చ్చి కీలక విష‌యాలు చెప్పారు. అన్న జ‌గ‌న్ పై కూడా కొన్ని విష‌యాలు చెప్పారు. తాము వ‌ద్ద‌న్నా పార్టీ పెట్టార‌ని వైసీపీ పెద్ద రామ‌కృష్ణా రెడ్డి అనడంపై కూడా ఆమె స్పందించారు. ఆయ‌న అలా అన‌డం త‌న‌కు బాధేసింద‌ని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap