పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఘాటుగా స్పందించారు. పవన్ కళ్యాణ్ నటించిన, సంపూర్ణేష్ బాబు నటించినా కష్టం ఒకటే అంటూ ఆయన ఎద్దేవా చేసారు. ఆన్లైన్ టికెట్ల పోర్టల్ గురించి చిత్ర పరిశ్రమ లోని కొందరు ప్రముఖులే ప్రభుత్వ పెద్దల తో చర్చించారు అని అన్నారు. ఆన్లైన్ పోర్టల్ అంటే ఎందుకంత భయం ? అని ఆయన ప్రశ్నలు వేసారు. దాని వల్ల జరిగే నష్టం ఏమిటి ? అని మంత్రి ప్రశ్నించారు. అకౌంటబులిటీ రావాలన్నదే సీఎం ఆలోచన అని మంత్రి స్పష్టం చేసారు. పారదర్శకత కోసమే ఆన్లైన్ పోర్టల్ అని అన్నారు ఆయన.

అందరికీ టికెట్ ధర ఒకేలా ఉండాలనేదే  మా ఉద్దేశం అని ఈ సందర్భంగా తెలిపారు. సినిమా ఖర్చులో కేవలం నలుగురైదుగురుకు మాత్రమే లబ్ధి ఎక్కువగా ఉంటుంది అని ఇది ఎంతవరకు సబబు అంటూ ఆయన ప్రశ్నించారు. నా ఒక్కడి కోసం చిత్రసీమని వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని పవన్ కళ్యాణ్ మాట్లాడడం సరికాదు అని ఆయన విమర్శించారు, ఇది పవన్ కళ్యాణ్ క్రియేషన్ అంటూ ఎద్దేవా చేసారు. చిత్రపరిశ్రమని ఇబ్బంది పెట్టే ఆలోచన మా ప్రభుత్వానికి లేదు అన్నారు అనీల్.

ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో పవన్ మాట్లాడుతున్నాడు అని చిత్ర పరిశ్రమనంతా  ఇబ్బంది పెడుతున్నామని ప్రొజక్షన్ ఇచ్చుకోవడం కరెక్ట్ కాదు అని ఆయన హితవు పలికారు. రాజకీయ ఉనికి కోసం సీఎం జగన్ ని తిట్టడం పవన్ కళ్యాణ్  కు ఫ్యాషన్ అయిపోయింది అని ప్రభుత్వ తీరును మారుస్తాను అన్నారు. నేను రోడ్డు ఎక్కితే మనిషిని కాదు, బెండు తీస్తాం అని పవన్ కళ్యాణ్  మాట్లాడటం చాలా సార్లు చూశాం అని ఆయన పేర్కొన్నారు. రెండు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకే మా అడుగులు అంటున్నాడు అని పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి పైకెళ్ళే లోపలే పార్టీ  చాపచుట్టేయడం  ఖాయం అని జోస్యం చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: