చిన్న‌, చిన్న విమ‌ర్శ‌ల‌కే జ‌గ‌న్ అండ్ కో చాలా సీరియ‌స్ గా ప్ర‌క‌ట‌న‌లు విడుద‌ల చేస్తుంది. కానీ ప‌వ‌న్ నిన్న అంత తిట్టినా కూడా ఆ స్థాయిలో అస్స‌లు మాట్లాడ‌లేదు. ఎందుక‌ని? ప‌వ‌న్ కు ఉన్న ఓటు బ్యాంకులో కొంత వాటా అప్పుడెప్పుడో ఎన్నిక‌ల్లో లాగేసుకుంది. ఇప్పుడు ప‌వ‌న్ పై ఘాటుగా మాట్లాడితే ఐదు జిల్లాల‌లో కాపు ఓటు బ్యాంకు అన్న‌ది వైసీపీకి లేకుండా పోతుంది.


 
కేవ‌లం కాపు నాయ‌కుల‌తోనే తిట్టించ‌డం కాకుండా అనీల్ యాద‌వ్ తో కూడా తిట్టించాడు జ‌గ‌న్. అయితే ఆయ‌న ఎప్ప‌టిలా అంత ఎగ్ర‌సివ్ గా అయితే రియాక్ట్ కాక‌పోవ‌డం కొంతలో కొంత ఉప‌శ‌మ‌నం. మాకు సంపూర్ణేష్ బాబు, కల్యాణ్ బాబు ఒక్క‌టేన‌ని త‌న‌కు తెలిసిన ప‌ద్ధ‌తిలో బాబుల క‌ల్చ‌ర్ కు ఓ డెఫినిష‌న్ మాత్రం ఇచ్చాడు. దీనిపై మిగ‌తా వాళ్లంతా వెంట‌వెంట‌నే రియాక్ట్ అయ్యారు. త‌నను క‌ల్యాణ్ తో పోల్చ‌డం ఆనందంగా ఉంద‌ని, అంతే పెద్ద మ‌న‌సుతో మా స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌డం అని సంపూర్ణేష్ వ్యాఖ్య‌లు చేయ‌డం విశేషం. ఇది మిన‌హా అనీల్ పెద్ద‌గా నోరేసుకు ప‌డిపోయింది ఏమీ లేదు. ప‌వ‌న్ ఒక‌నాటి స్నేహితుడు, తీన్మార్ సినిమా తెర‌వెనుక నిర్మాత బొత్స కూడా మ‌రీ నోరేసుకుప‌డిపోలేదు. ఇవ‌న్నీ ప‌వ‌న్ క్రేజ్  ను దృష్టిలో ఉంచుకుని మంత్రులు చేసిన వ్యాఖ్య‌లే కావ‌డం మ‌రో విశేషం.

 
ఏపీ ప్ర‌భుత్వంపై చాలా విమ‌ర్శ‌లు చేసి ప‌వ‌న్ క‌ల్యాణ్ నిన్న‌టి రాత్రి నుంచి నెట్టింట్లో హ‌ల్ చేస్తూనే ఉన్నాడు. ఆయ‌న అభిమానుల కు ఈ మాట‌లు భ‌లే న‌చ్చ‌డంతో అవి విప‌రీతంగా ట్రోల్ అవుతున్నాయి. వివిధ ఫొటోల‌తో ఆడియో వాయిస్ జ‌త చేసి కొంద‌రు, పూ ర్తిగా కొత్త వీడియోల‌ను విడుద‌ల చేసి ఇంకొంద‌రు ఆనందిస్తున్నారు. గ‌తంలో ఏపీ మంత్రులు ఇలాంటివి ఏంజ‌రిగినా చాలా వేగంగా, ఎగ్ర‌సివ్ గానే రియాక్ట్ అయ్యేవారు కానీ ఈ రోజు రియ‌క్ట్ అయిన వారెవ్వ‌రూ ముంద‌రి వేగంలో లేరు ఎందుక‌ని?

మరింత సమాచారం తెలుసుకోండి:

ap