బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విషయంలో టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఈ మధ్య కాలంలో కాస్త జాగ్రత్త పడుతుంది అని ప్రచారం జరుగుతోంది. బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్న ప్రాంతాల్లో టీఆర్ఎస్ పార్టీ నాయకత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు అనే విషయంలో కొంత సమాచారాన్ని తెప్పించుకున్నటీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆయన తో మాట్లాడే ప్రయత్నం చేస్తున్న కొంతమంది టీఆర్ఎస్ నాయకులకు ఫోన్లు కూడా చేస్తుందని తెలుస్తోంది. బిజెపి లోకి వెళ్ళడానికి కొంత మంది టిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు అని భావిస్తున్న ఆ పార్టీ అధిష్టానం వాళ్ల మీద అవసరమైన చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధమవుతుంది.

బండి సంజయ్ ఇద్దరు ఎమ్మెల్యేలతో ఈ పాదయాత్రలో ఇప్పటివరకు మాట్లాడారని ఆ ఇద్దరు ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్ కూడా మాట్లాడారని వాళ్ళిద్దరూ ఇప్పుడు సైలెంట్ అయ్యారు అని అంటున్నారు. పార్టీని ఇబ్బంది పెడితే మాత్రం కచ్చితంగా చర్యలు ఉంటాయని మంత్రి కేటీఆర్ వాళ్లకు హెచ్చరికలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. బిజెపి తో మంచి సంబంధాల కోసం ప్రయత్నాలు చేసే కొంతమంది ఎమ్మెల్యేలు అదేవిధంగా మీడియా ముందు మాట్లాడకుండా సైలెంట్ గా ఉండే ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోవడానికి టిఆర్ఎస్ పార్టీ రెడీ అవుతోంది.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ నుంచి ఏ ఒక్కరు బయటకు వెళ్ళిన భారతీయ జనతా పార్టీ కి కలిసివచ్చే విధంగానే ఉంటుంది. అందుకే బండి సంజయ్ పాదయాత్ర మీద టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం నిఘా పెట్టిందని కొంతమంది కీలక నాయకులు బండి సంజయ్ ను జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నారని అంటున్నారు.  టీఆర్ఎస్ పార్టీలో   అసంతృప్తి ఉన్న నాయకుల మీద ప్రత్యేక ఫోకస్ పెట్టి వాళ్ళ అసంతృప్తిని తగ్గించే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం చేస్తోందని సమాచారం. మరి ఇది ఎంతవరకు ముందుకు వెళుతుంది ఏంటి అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp