తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొన్ని కొన్ని విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటుంది అనే విషయం మనకు క్లియర్ గా అర్థమవుతుంది. తెలంగాణ బిజెపి నాయకత్వం ఈ మధ్యకాలంలో బలోపేతం కావడానికి అనేక అడుగులు వేస్తున్న తరుణంలో పార్టీ నేతల మధ్య సఖ్యత కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తోంది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రతి ఒక నాయకుడిని కలుపుకొని పోయేందుకు సిద్ధమవుతున్నారు. టీఆర్ఎస్ పై పోరాటానికి అన్ని వర్గాలను ఆయన కలుపుకొని పోయే విధంగా రాజకీయం చేస్తున్నారు.

కానీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వైఖరి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఇటీవల సంగారెడ్డి జిల్లాలో క్రికెట్ టోర్నమెంట్ పెట్టిన రేవంత్ రెడ్డి దానికి సంబంధించి జహీరాబాద్ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న మాజీ మంత్రి గీతారెడ్డికి ఎటువంటి సమాచారం కూడా ఇవ్వలేదు. అలాగే సంగారెడ్డి ఎమ్మెల్యే కి కూడా సమాచారం ఇవ్వకుండానే రేవంత్ రెడ్డి పర్యటనలు నిర్వహిస్తున్నారు. దీనిపై సంగారెడ్డి ఎమ్మెల్యే ఇటీవల జరిగిన కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో మండిపడ్డారు. రాజకీయంగా పార్టీ కష్టాలు పడుతున్న సమయంలో ఈ వైఖరి మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు.

అయితే ఇప్పుడు ఆయన చేసిన ఒక కామెంటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీని బాగా ఇబ్బంది పెడుతుంది. తాను టీఆర్ఎస్ పార్టీ లోకి వెళ్ళాలి అనుకుంటే ఎవరు ఆపుతారు అంటూ ఆయన చేసిన కామెంట్ తర్వాత టీ కాంగ్రెస్ లో చర్చలు జరుగుతున్నాయి. ఏడాది క్రితం కూడా ఆయన టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లే అంశం గురించి మాట్లాడారు. ఇప్పుడు కూడా అదే అంశం గురించి హైలెట్ చేస్తూ మాట్లాడటంతో ఆయన పార్టీ మారతారా అనే చర్చలు మొదలయ్యాయి. అయితే ఇప్పుడు ఆయన పార్టీ మారే అవకాశం ఉందని త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసే అవకాశం ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts