సినిమా పరిశ్రమ పై‌ వైసిపి దోపిడీ ని పవన్ కళ్యాణ్ కళ్లకు కట్టినట్లు వివరించారు అని అన్నారు జనసేన నేత పోతిన వెంకట మహేష్. వైసిపి మంత్రులు పళ్లు తోమకుండానే నోళ్లేసుకుని పవన్ పై పడ్డారు అని ఆయన ఆరోపణలు చేసారు. పవన్ పై సిబిఐ కేసులున్నాయా, ప్రజలను దోచుకున్నారా అని నిలదీశారు. నోరు అదుపులో పెట్టుకుని వైసిపి నాయకులు మాట్లాడాలి అని ఆయన హితవు పలికారు. జగనన్న వదిలిని బాణం అన్న సొంత చెల్లి షర్మిలను మోసం చేశారు అని తడి గుడ్డ తో గొంతులు కోసే నైజం జగన్ ది అంటూ ఆయన వ్యాఖ్యలు చేసారు.

తల్లి, చెల్లి పక్క రాష్ట్రానికి వెళ్లిపోయేలా‌ చేసింది  ఎవరు అని ప్రశ్నించారు. జగన్ మోసాన్ని ఈ దద్దమ్మలు ఎందుకు ప్రశ్నించరు అని ఆయన నిలదీశారు. సొంత బాబాయి హత్య జరిగితే  దోషులను పట్టుకోలేక పోయారు అన్నారు. వైసిపి ప్రభుత్వం లో మహిళల పై దాడులు, దారుణాలు పెరిగి పోయాయి అని చెప్పుకొచ్చారు. పారిశ్రామిక వేత్తలు రాష్ట్రం వదిలి పారిపోయారు అని ఆయన అన్నారు. దుర్మార్గపు ప్రభుత్వాన్ని తిట్టడానికి కూడా మాటలు రావడం లేదు అని ఘాటు వ్యాఖ్యలు చేసారు. వేలాది మంది కష్టం తో సినిమా తీస్తే... మీరు టిక్కెట్లు అమ్ముకుంటారా అని ప్రశ్నలు వేసారు.

వైసిపి కార్యకర్తలు కే వాలంటీర్ లు ఇచ్చామని విజయసాయి రెడ్డి చెప్పారు అని అన్నారు. ఇప్పుడు మీ కార్యకర్తలు తో బ్లాక్ లో టిక్కెట్లు అమ్మిస్తారా అని ప్రశ్నించారు. విజయవాడ లో ఓ సన్నాసి మంత్రి నోటికి వచ్చినట్లు వాగుతున్నాడు అని మూడు నెలల్లో మంత్రి పదవి పోతుందని నోరు పారేసుకుంటున్నాడు అంటూ ఆయన వ్యాఖ్యానించారు. బ్రహ్మానందం కామెడీలు మానుకుంటే మంచిది అని హితవు పలికారు. మూడు కొబ్బరి చిప్పలు, ఆరు చెప్పులు, వన్ టౌన్ వెస్ట్ లో వేస్ట్ ఫెలో వంటి సినిమాలు నీకు సూటవుతాయి అన్నారు. దేవాదాయ శాఖ నే భ్రష్టు పట్టించిన నువ్వా పవన్ ను విమర్శించేది అంటూ ఆయన ఎద్దేవా చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: