తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఏవిధంగా ఉంది ఏంటి అనేది మనం గత 7, 8 ఏళ్ల నుంచి స్పష్టంగా చూస్తున్నాం. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలుగుదేశం పార్టీ పరిస్థితి రోజు రోజుకూ దిగజారి పోయింది. కార్యకర్తల బలం ఉన్నా సరే పార్టీ అధిష్టానం మాత్రం పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేయలేకపోవడం పార్టీ కార్యకర్తలను బాగా ఇబ్బంది పెట్టిన అంశంగా చెప్పుకోవాలి. చాలా మంది కార్యకర్తలు పార్టీ వ్యవహారాల మీద అసంతృప్తి గా ఉండి సోషల్ మీడియాలో విమర్శలు చేసిన పరిస్థితి కూడా ఉంది.

అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బలపడాలంటే సమర్ధవంతమైన నాయకత్వం అవసరం అవుతుంది. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం ఆ దిశగా అడుగులు వేయలేకపోవడం చికాకు గా మారింది. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికలకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయని సమాచారం. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీతోనే మరోసారి కలిసి వెళ్లే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వంతో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకత్వం మాట్లాడుతుందని ఇటీవల అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నర్సింహులు రేవంత్ రెడ్డి తో ఫోన్లో మాట్లాడాలి అని తెలుస్తుంది. త్వరలోనే దీనికి సంబంధించి ఒక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉండవచ్చని కూడా ప్రచారం మొదలైంది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ కూటమి ఓడి పోవడానికి ప్రధాన కారణం పొత్తు పెట్టుకొని ముందుకు వెళ్ళడమే. తెలుగుదేశం పార్టీ పుట్టింది కాంగ్రెస్ పార్టీ పై పోరాటానికి అయితే తెలుగుదేశం పార్టీ అదే పార్టీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేయడం ప్రత్యర్థులకు పెద్ద అస్త్రంగా మారింది. అయితే మళ్లీ అదే సాహసం చేయడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధం కావడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: