విజయవాడ ఎంపీ కేశినేని నాని తీసుకున్న నిర్ణయంతో తెలుగుదేశం పార్టీ వర్గాలు ఒక్కసారిగా నివ్వెర పోయాయి. తెలుగుదేశం పార్టీ కృష్ణాజిల్లా కేశినేని నాని ప్రస్తుతం పెద్ద దిక్కుగా ఉన్నారు. అలాంటి నాని వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసేది లేదని తన కుమార్తె కూడా పోటీ చేసేది లేదని ప్రకటించడం ఇప్పుడు సంచలనం అయింది. కేశినేని నాని ఎందుకు పోటీ చేయకుండా నిర్ణయం తీసుకున్నారు ఏంటి అనే దానిపై ఇప్పుడు చర్చలు జరుగుతున్న సమయంలో... విజయవాడ పార్లమెంటు సీటు కోసం ఒక కీలక నేత ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ అభ్యర్థిగా గద్దె రామ్మోహన్ పోటీ చేసే అవకాశాలున్నాయని సమాచారం. పార్టీ అధిష్టానం ఇప్పటికే ఆయన ను ఖరారు చేసిందని దీనికి సంబంధించి గద్దె రామ్మోహన్ కూడా సుముఖత వ్యక్తం చేశారని సమాచారం. గతంలో ఒకసారి విజయవాడ ఎంపీగా ఆయన పోటీ చేశారు. అప్పుడు ఎంపిక విజయం సాధించిన ఆయన ఆ తర్వాత గన్నవరం ఎమ్మెల్యే గా కూడా పని చేశారు. అయితే అనూహ్యంగా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి 2014లో ఆయన బరిలోకి దిగారు.

ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కృష్ణాజిల్లా మీద ఫోకస్ పెట్టకపోతే కీలక నాయకత్వం అలాగే కార్యకర్తలు క్రమంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అందుకే విజయవాడ పార్లమెంట్ సీటు విషయంలో ఎక్కువగా జాప్యం జరగకుండా ఉండడానికి చంద్రబాబు నాయుడు కీలక అడుగు వేశారని సమాచారం. విజయవాడ పార్లమెంటు సీటు విషయంలో కేశినేని నాని సూచన మేరకే గద్దె రామ్మోహన్ ను చంద్రబాబు నాయుడు ఖరారు చేశారనే ప్రచారం కూడా జరుగుతోంది. మరి ఇది ఎంతవరకు నిజం ఏంటి అనేది తెలియాల్సి ఉంది. అయితే వచ్చే ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజక వర్గానికి గద్దె రామ్మోహన్ సతీమణి గద్ద అనురాధ పోటీ చేసే అవకాశం ఉండొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

tdp