రాష్ట్ర రాజ‌కీయాలు ఉడుకు ర‌క్తంతో ఉర‌క‌లెత్తిస్తున్నాయి. పాత త‌రం నేత‌లు, రాజ‌కీయ కురువృద్దులు, సీనియ‌ర్లు, రాజ‌కీయంలో ముందు నుంచి వారి వారి బంధువుల‌తో నిండిపోయిన రాష్ట్ర రాజ‌కీయంలో.. కొంత కాలం నుంచి నిజానికి కొత్త ద‌నం క‌నిపిస్తోందని చెప్పాలి. ఒక వైపు అధికార పార్టీలో కేటీఆర్ అండ్ టీమ్ సిద్ధ‌మ‌వుతుంటే.. అలాగే టీఆర్ఎస్‌కు, ఆ పార్టీ నేత‌ల‌కు చెక్ పెట్టేలా రాష్ట్ర రాజ‌కీయాలు ఊపందుకుంటున్నాయి. ఇప్ప‌టి వ‌రకు స‌భ‌లు స‌మావేశాలు, ఏమైన ముందుండి న‌డిపించే సీనియ‌ర్లు ఇప్పుడు వెనుక వ‌రుస‌లో కూర్చుంటున్న‌ట్టు క‌నిపిస్తోంది.


  రాష్ట్ర రాజ‌కీయాల్లో ప్ర‌క్షాళ‌న జ‌రుగుతుందా అంటే అవున‌నే చెబుతున్నారు.. రాజ‌కీయ విశ్లేష‌కులు. ఇప్ప‌టికే కాంగ్రెస్‌లో భారీ మార్పులు జ‌రుగుతున్నాయి. ఎందరో సీనియ‌ర్ల‌ను ప‌క్క‌న బెట్టి రేవంత్ రెడ్డికి టీపీసీసీ ప‌ద‌విని అప్పగించారు.  అలాగే భార‌తీయ జ‌న‌తా పార్టీలోనూ అదే క‌నిపిస్తోంది. ఈ బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ చేప‌ట్టిన పాద‌యాత్ర‌లో కూడా సీనియ‌ర్లు కేవ‌లం అతిథిలుగా ఉన్నారు. అలాగే టీఆర్ఎస్‌లోనూ కొత్త త‌రం నేత‌ల‌కు అవ‌కాశం ఇవ్వాల‌నే అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది. దీంట్లో భాగంగానే జిల్లా క‌మిటీల్లో కేటీఆర్ వ‌ర్గీయుల‌కు పెద్ద పేట వేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది.


   అలాగే, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో సంస్థాగ‌త మార్పులు జ‌రుగుతున్నాయి. ద‌ళిత గిరిజ‌న దండోర స‌భ‌ల‌తో రేవంత్ వ‌ర్గీయుల‌కు ప్రాధాన్యం ఇస్తున్న‌ట్టు క‌నిపిస్తోంది. రేవంత్ కాంగ్రెస్ లోకి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి కొంద‌రు నేత‌ల‌కు ప్రాధాన్యం పెరిగింద‌నే చెప్పాలి. కొంత కాలంగా సైలెంట్‌గా ఉన్న కొండా దంపతులు ఇప్పుడు వ‌రంగ‌ల్ జిల్లాలో చ‌క్రం తిప్పుతున్నారు. ఈ మ‌ధ్య  గ‌జ్వేల్ స‌భను కొంద‌రు సీనియ‌ర్లు వ‌ద్ద‌న్నారు.. డుమ్మా కొట్టారు కూడా. అయిన‌, స‌భ‌ను నిర్వ‌హించి విజ‌య‌వంతం చేశారు రేవంత్ రెడ్డి. ఇక‌, కాంగ్రెస్ అంటే తామే అన్న‌ట్టుగా ఉండే జానారెడ్డి, ఉత్త‌మ్‌, కొమ‌టి రెడ్డి, హ‌న్మంత‌రావు, రాజ్‌గోపాల్ రెడ్డి ప్ర‌ధానంగా ఈ స‌భ‌లో క‌నిపించిన‌ట్టు అనిపించ‌లేదనే చ‌ర్చ జ‌రుగుతోంది. ఇలా మొత్తంగా చూసుకుంటే రాష్ట్ర రాజ‌కీయాల్లో యువ‌నేత‌ల హ‌వా క‌నిపిస్తుంద‌నే చెప్పాలి.


   

మరింత సమాచారం తెలుసుకోండి: