జ‌గ‌న్ త‌న త‌ర‌ఫున పార్టీ ప‌దవులు ఇవ్వ‌డంలో గొప్ప  ఏం లేదు. ప్ర‌భుత్వం త‌ర‌ఫున ప‌ద‌వులు ఇవ్వ‌డంలోనే అంతా ఉంది. ఆ విధంగా జ‌గ‌న్ విధేయుల‌కు ప‌ద‌వులు ఇచ్చాడు.త‌న భ‌క్తుల‌కు ప‌ద‌వులు ఇచ్చాడు అందుకేనేమో ఆమె ఆయ‌న‌ను ప్ర‌త్య‌క్ష దైవం అని అన్నారు. ఇలా అన‌డం, వ్య‌వ‌హ‌రించ‌డం ఏమీ కొత్త కాదు కానీ ప్ర‌మాణ స్వీకారం రోజున త‌న ప‌త్రంలో లేని ప‌దాన్ని చ‌దివి వినిపించి ఆమె స్వామి భ‌క్తికి నిద‌ర్శ‌నం అయి, అనంత రాజ‌కీయాల్లోనే హాట్ టాపిక్ అయ్యారు.రాజ‌కీయాల్లో ఎవ‌రి న‌మ్మ‌కాలు వారివి. ఎవ‌రి విశ్వాసాలు వారివి. ప్ర‌భు భ‌క్తి, స్వామి భ‌క్తి పేరిట చాలా మంది వీర విధేయులుగా ఉంటారు. అలా ఉండడంలోనే రాజకీయం అంతా ఉంది అని చెప్ప‌క‌నే చెబుతారు. వీర‌విధేయ‌త కార‌ణంగానే ప‌ద‌వులు వ‌రిస్తాయి అన్న‌ది కూడా సుస్ప‌ష్టం. ఈ నేప‌థ్యంలో  కొత్త‌గా ఎంపిక‌యిన జెడ్పీ చైర్మ‌న్లు, ఎంపీపీలూ ప్ర‌భు భ‌క్తి ప్ర‌కటిస్తూనే ఉన్నారు. కొంద‌రు ప్ర‌భు భక్తిని ప్ర‌ద‌ర్శించ‌డంలో ఇత‌రుల‌ను చూసి నేర్చుకుంటున్నారు. ఇదేం త‌ప్పు కాదు. తమ‌కు రాజ‌కీయంగా ప‌ద‌వీ భిక్ష పెట్టిన జ‌గ‌న్ పైనో, చంద్ర‌బాబుపైనో ఆ పాటి ప్రేమ ఉండ‌డం త‌ప్పు కాదు. వారి  దారిని అనుస‌రించి ఇంత‌వారం అయ్యాము అన్న అభిమానం ఉంచ‌డం కూడా త‌ప్పు కాదు. కానీ ఈ స్వామి భ‌క్తి ఎల్ల‌కాలం ఉంటుందా అన్న‌దే సందేహం. రాజ‌కీయాల్లో రోజుకో పార్టీ మారే నేత‌లున్న చోట ఓ జెడ్పీ  చైర్మ‌న్ మాత్రం వినూత్నంగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఎలా అంటే......అనంత‌పురం జెడ్పీ చైర్మ‌న్ గా గిరిజ‌మ్మ ప్ర‌మాణ స్వీకారం చేస్తూ.. ఉన్న‌తాధికారం చదివిన రీతిలోనే చ‌దువుతూ చివ‌ర్లో నా ప్ర‌త్య‌క్ష దైవం జ‌గ‌న్ సాక్షిగా ప్ర‌మాణ స్వీకారం చేస్తున్నాను అని ప‌లికి సంచ‌ల‌నం అయ్యారు. ఎంత కాద‌న్నా ఇది ఆధునిక కాలం. ఎవ‌రి భ‌క్తి ఎలా ఉన్నా జ‌గ‌న్ ను దేవుడ్ని చేసి మ‌రీ! ప్ర‌మాణ స్వీకారం చేసిన గిరిజ‌మ్మ వార్త‌ల్లో వ్య‌క్తి అయ్యారు. ప్ర‌జా స్వామ్యంలో ప్ర‌జ‌లు దేవుళ్లు అని అన్నాడు ఎన్టీఆర్. స‌మాజ‌మే దేవాల‌యం అని చెప్పాడు ఎన్టీఆర్. కానీ ఆమె మాత్రం పూర్తిగా త‌న దైవం జ‌గ‌న్ అని పేర్కొంటూ ప్ర‌మాణ స్వీకారం ముగించ‌డంతో వైసీపీ శ్రేణుల‌లో ఆనందం నింపారు. ఈ వివ‌రం విన్న క‌లెక్ట‌ర్ మాత్రం అప్ర‌మ‌త్త‌మై దీనిపై ప‌రిశీల‌న చేస్తాన‌ని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap